మేకప్ అక్కర్లేదు.. ఈ సింపుల్ చిట్కా పాటిస్తే సహజంగానే వైట్ గా బ్రైట్ గా మెరిసిపోతారు!

ఇటీవ‌ల కాలంలో మేకప్ కు( Makeup ) మగువలు బాగా అలవాటు పడ్డారు.అసలు మేకప్ లేనిదే బయట కాలు కూడా పెట్టడం లేదు.

 Follow This Simple Tip And Youll Naturally Glow White And Bright Details! Skin W-TeluguStop.com

అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని మేకప్ ను వేసుకుంటూ ఉంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే మేకప్ అక్కర్లేదు.

సహజంగానే వైట్ గా బ్రైట్ గా మెరిసిపోతారు.మేకప్ లుక్ మీ సొంతం అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో చిటికెడు కుంకుమపువ్వు, అరకప్పు గోరువెచ్చని పాలు( Warm Milk ) వేసుకుని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు బియ్యాన్ని ( Rice ) వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.

ఇలా ఉడికించిన రైస్ ను మిక్సీ జార్ లో వేసుకోవాలి.

అలాగే నానబెట్టుకున్న కుంకుమపువ్వు పాలతో సహా వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్‌ ఆయిల్, నాలుగు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు ఏదైనా బ్రెష్ సహాయంతో కాస్త మందంగా అప్లై చేసుకుని ముప్పై నిమిషాలు ఆరబెట్టుకోవాలి.

పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే స్కిన్ టోన్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.మేకప్ అక్కర్లేదు.ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే సహజంగానే చర్మం తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతుంది.పైగా ఈ రెమెడీని త‌ర‌చూ యూస్ చేస్తే ముడతలు త్వరగా రాకుండా ఉంటాయి.స్కిన్ టైట్ గా మారుతుంది.

డెడ్ స్కిన్ సెల్స్ సైతం తొలగిపోయి చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube