నెలసరి నొప్పులను మాయం చేసే కర్బూజ.. ఇలా తీసుకుంటే వెయిట్ లాస్ కూడా!

సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది.ఈ సీజన్ లో విరివిరిగా లభ్యమయ్యే పండ్లలో కర్బూజ ఒకటి.

ఈ పండు రుచిగా ఉండడమే కాదు బోలెడన్ని పోషకాలను కలిగి ఉంటుంది.మ‌న‌కు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.

మహిళల్లో నెలసరి నొప్పులను మాయం చేయడానికి కూడా కర్పూజ ఉత్తమంగా సహాయపడుతుంది.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా కర్బూజ పండును తీసుకుంటే వెయిట్ లాస్ కూడా అవుతారు.

మరి ఇంకెందుకు ఆలస్యం కర్బూజను ఎలా తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక కప్పు కర్బూజ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి.

Advertisement

అలాగే ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండ‌ర్‌ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కర్బూజ ముక్కలు, బొప్పాయి ముక్కలు, ఒక గ్లాస్ బాదం పాలు, అర టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ వాట‌ర్ లో నానబెట్టుకున్న చియా సీడ్స్ ను మిక్స్ చేసుకుని తాగేయడమే.ఈ కర్బూజ‌ బొప్పాయి జ్యూస్ ను రెండు రోజులకు ఒకసారి తీసుకుంటే నెలసరి సమయంలో నొప్పులు అన్నమాట అనరు.పైగా వెయిట్ లాస్ కు ఈ జ్యూస్ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.

అంతేకాదు ఈ కర్పూజ బొప్పాయి జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల వేసవి కాలంలో డిహైడ్రేషన్, సన్ స్ట్రోక్ వంటి ప్ర‌మాద‌క‌ర‌మైన సమస్యల బారిన పడకుండా ఉంటారు.నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.కంటి చూపు మెరుగుపడుతుంది.

క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.

తమిళ హీరోలకు వచ్చినన్ని అవార్డ్ లు తెలుగు వారికి ఎందుకు రాలేదు ?
ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!

మరియు లంగ్స్ శుభ్రంగా ఆరోగ్యంగా కూడా మారతాయి.

Advertisement

తాజా వార్తలు