బహుజన రాజ్యంలో ఒకే ఒక్క సంతకంతో వందల మంది పేద బహుజన విద్యార్థులను విమానాల్లో అమెరికా పంపిస్తామని ఈ మాట తప్పితే రాళ్లతో కొట్టండని ప్రజలకు తెలియజేశారు టిఆర్ఎస్ నాయకుల వలే దొంగ హామీలు,మోసపూరిత హామీలు,ఆచరణకు దూరమైన హామీలు ఇవ్వమని డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా 58వ రోజు వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల,కారెపల్లి మండలాల్లో పర్యటించారు.
యాత్రలో భాగంగా మొదట మార్గమధ్యంలో అస్తనగురిలో ఉపాధిహామీ కూలీలతో కలిసి ముచ్చటించారు.ఉపాధి పని చేయించడానికి ముగ్గురు అధికారులు ఉన్నారు కానీ పనికి వేతనం ఇచ్చే వారు మాత్రం ఎవరూ లేరని ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు.
అనంతరం చిహ్నముగా లో మాట్లాడుతూ, ఒకప్పుడు కేసిఆర్ కు ఉన్న 50ఎకరాల భూమి ఇపుడు 300ఎకరాలకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు.మనం ఓట్లేస్తే గెలిచి మన నెత్తి మీద అప్పులు మోపి వాల్లు ఫాంహౌస్ లు కట్టుకుంటున్నారు.
ఇది దొరల ప్రభుత్వం,దోపిడీ ప్రభుత్వం అని,ఈ పాలనలో పేదలకు న్యాయం జరగదని పేర్కొన్నారు.*బిఎస్పి అధికారంలోకి రాగానే కల్వకుంట్ల కుటుంబం వారు అక్రమంగా సంపాదించిన ఆస్తులను అమ్మి పేదల విద్య వైద్యం స్వయం ఉపాధి కోసం ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు.100కు 50 మంది ఉన్న బీసిలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అన్యాయానికి గురౌతున్నారని గుర్తుచేశారు.
బిఎస్పి పార్టీ జనాభా దామాషా ప్రకారం బిసిలకు 70 సీట్లు ఇస్తామని, దమ్ముంటే ఆధిపత్య పార్టీలకు చెందిన కేసిఆర్, రేవంత్ రెడ్డి,బండి సంజయ్ ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
బహుజనులకు న్యాయపరమైన వాటా అందించేది కేవలం బిఎస్పి పార్టీనే అని స్పష్టం చేశారు.తెలంగాణలో ఉన్న 99 శాతం ఉన్న ప్రజల పార్టీ బిఎస్పీ అని, ఈ పార్టీ పేదల ఇళ్లల్లో, ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ అన్నారు, అందుకే అధికార పార్టీ నాయకులు ఎన్ని అవరోధాలు సృష్టించిన ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి పార్టీకి మద్దతు తెలుపుతూ, అర్ధరాత్రి వరకు మా కోసం ఎదురుచూస్తున్నారని, రాబోయే కాలంలో బహుజనులదే రాజ్యం అని ప్రకటించారు.
వైరా నియోజకవర్గంలో చివరి రోజు యాత్ర సందర్భంగా పత్రిక సమావేశంలో మాట్లాడుతూ, నియోజకవర్గంలో వేలాదిమంది ప్రజలు ఇళ్లు లేక బాధపడుతున్నారన్నారు.పల్లిపాడులో గంగిరెద్దుల కాలనీలో పర్యటించి వారి ఇళ్లను సందర్శించారు.
ప్రభుత్వం సంచార జాతులైన ఎంబిసి ల కోసం కార్పోరేషన్ పెట్టి మరిచిపోయిందన్నారు./br>
వారికోసం కేటాయించిన నిధులు ఎవరు మింగారని మండిపడ్డారు.ఇంతవరకు ఈ సామాజిక వర్గం నుండి ఒక ఎమ్మెల్యే కూడా ఎందుకు లేరని ప్రశ్నించారు.వారి బాధను చూసి పరిష్కారం చూపే మార్గాలు వెతకడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
పేదలకు చెందిన అసైన్డ్ భూములను టిఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకుని, వైకుంఠధామాలు,ప్రకృతివనాలు నిర్మిస్తున్నారని పేదల భూముల బదులు నాయకులకు చెందిన ఫాంహౌస్ లలో నిర్మించాలని సూచించారు.వంద కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి బదులు టిఆర్ఎస్ నాయకులకు చెందిన సొంత భూమిలో పార్టీ కార్యాలయం నిర్మించుకోవాలని సూచించారు.
బిఎస్పి పార్టీ రాకెట్ వలే దూసుకుపోతుందని,ఆధిపత్య పార్టీల్లో పనిచేస్తున్న బిసి నాయకులంతా బిఎస్పిలో చేరి బహుజన రాజ్యం సాధించాలని పిలుపునిచ్చారు.వచ్చే ఎన్నికల్లో వైరా నియోజకవర్గంలో నీలి జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
బహుజన పాలనలో పోడుభూములకు, అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు.కూలీ,హమాలీ,కార్మికుల బతుకులను మార్చి బహుజన కులాలకు సంపద అందిస్తామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు,పేదలకు ఫించన్లు ఇచ్చే పరిస్థితి లేదంటే,ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు.యాత్రలో భాగంగా పలు గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరించారు.
యాత్ర తదుపరి పేరపల్లి,కారెపల్లిలో కఒనసాగనుంది.