కొత్త నెంబర్ నుండి వీడియో కాల్ లిఫ్ట్ చేస్తే.. రూ.5.35 లక్షల మూల్యం.. తస్మాత్ జాగ్రత్త..!

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు(Cyber ​​crimes) ఎంత విపరీతంగా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఏ వార్త విన్నా వినకపోయినా ప్రతిరోజు సైబర్ నేరాల గురించి వింటూనే ఉంటాం.

ఉన్నత చదువులు చదివి ఆదర్శ భారత పౌరులుగా పేరు పొందాల్సిన వారే జల్సాలకు, చెడు అలవాట్లకు బానిసై కొందరు.ఉద్యోగాలు దొరకక మరికొందరు సైబర్ నేరగాలుగా మారుతున్నారు.

హర్యానాలోని ఓ యువకుడికి జరిగిన సంఘటన తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.హర్యానాలోని అంబాల కంటోన్మెంట్ కు చెందిన ఓ 25 ఏళ్ల యువకుడికి ఫిబ్రవరి 9న ఒక మహిళ వాట్సప్ వీడియో కాల్ చేసింది.

గుర్తుతెలియని వ్యక్తి నుండి వచ్చిన ఆ వీడియో కాల్ లిఫ్ట్ చేస్తే ఓ మహిళ కాసేపు మాట్లాడి నగ్నంగా ఆ యువకుడికి దర్శనం ఇచ్చి కాల్ కట్ చేసింది.

Advertisement

ఆ యువకుడు తిరిగి కాల్ చేస్తే నెంబర్ బ్లాక్ అయినట్లు తెలిసింది.మరుసటి రోజు మరొక గుర్తు తెలియని నెంబర్ నుండి వాట్సప్ కాల్(WhatsApp call ) వచ్చింది.యువకుడు ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసాక తాను పోలీస్ అధికారులని, వీడియో కాల్స్ చేస్తున్న మహిళతో పాటు ముఠా సభ్యులను పట్టుకున్నమని, అందులో నీ పేరు కూడా ఉంది నీపై కేసు పెట్టకూడదంటే డబ్బులు చెల్లించాలని చెప్పాడు.

ఒక్కసారిగా భయపడిపోయిన ఆ యువకుడు ఏం చేయాలో అర్థం కాక రూ.51000 చెల్లించాడు.ఇలా పలుమార్లు బెదిరించి విడుదలవారీగా రూ.5.35 లక్షల రూపాయలు బదిలీ చేయించుకున్నారు.చివరికి తాను మోసపోయానని గ్రహించిన ఆ యువకుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లు దారుణాలు చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తారని, ఫోన్లో వచ్చే లింకులపై క్లిక్ చేయడం, కొత్త నెంబర్ల నుండి వచ్చే కాల్స్ పట్ల జాగ్రతగా ఉండాలని తెలిపారు.

షర్మిల వ్యవహారం పై టెలికాన్ఫరెన్స్ 'సజ్జల ' సంచలన వ్యాఖ్యలు 
Advertisement

తాజా వార్తలు