ఆర్ఆర్ఆర్ ( RRR ) సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ గురించి ఈ మధ్యకాలంలో ఏ చిన్న వార్త వినిపించినా కూడా అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే తాజాగా రామ్ చరణ్ ( Ram Charan ) తన చేతికి ధరించిన వాచ్ విలువ ఎన్ని కోట్లో తెలుసా అని సోషల్ మీడియాలో ఒక వార్త వినిపిస్తోంది.
మరి ఇంతకీ రామ్ చరణ్ తన చేతికి ఎన్ని కోట్ల వాచ్ పెట్టుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్యనే తన తమ్ముడు వరుణ్ తేజ్ పెళ్లికి ఉపాసన క్లీంకారా తో కలిసి వెళ్లారు.
ఇక పెళ్లిలో రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు చాలా సింపుల్ గా ఉన్నారు.
ఇక రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ సింపుల్ గా ఉన్నప్పటికీ ఆయన ఖరీదైన వాచ్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.అయితే రామ్ చరణ్ కి వాచ్ కలెక్షన్స్ అంటే చాలా ఇష్టమట.ఆయన కొన్ని కోట్ల విలువ చేసే వాచ్ లు కొనుగోలు చేస్తారని తెలుస్తోంది.
ఇప్పటికే ఆయన దగ్గర ఎన్నో ఖరీదైన వాచ్ లు కూడా ఉన్నాయి.అయితే వరుణ్ తేజ్ ( Varun Tej ) లావణ్య త్రిపాఠి పెళ్లిలో కూడా ఆయన చేతికి పెట్టుకున్న ఆ వాచ్ చాలా ఖరీదు అని తెలుస్తోంది.
ఇక రామ్ చరణ్ వరుణ్ తేజ్ పెళ్లికి పెటల్ ఫిలిప్స్ మోడల్( Petal Phillips model ) కి చెందిన వాచ్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.ఇక ఈ వాచ్ ఖరీదు దాదాపు 2,85000 డాలర్లు అని సమాచారం.ఇక ఇది మన ఇండియన్ కరెన్సీ లో చూసుకుంటే ఆ వాచ్ ఖరీదు దాదాపు 2 కోట్ల 85 లక్షలు ఉంటుందని తెలుస్తోంది.ఇక ఆ వాచ్ ఖరీదు తెలిసి మీకందరికీ మైండ్ అవుతుంది.
ఎందుకంటే ఒక వాచ్ ఖరీదు రెండు కోట్ల 85లక్షలు అంటే మామూలు విషయం కాదు.ఆ ఒక్క వాచ్ తో ఎన్నో మధ్య తరగతి కుటుంబాలు జీవితాంతం బతకవచ్చు.
ఇక అంత ఖరీదైన వాచ్ ని రామ్ చరణ్ తన చేతికి పెట్టుకున్నారని తెలుస్తోంది.ఏది ఏమైనప్పటికీ ఈ విషయం తెలిసిన కొంతమంది నెటిజన్స్ మాత్రం వాచ్ కి అన్ని కోట్లు ఖర్చు పెట్టే బదులు అవే డబ్బులతో పేదవారికి సహాయం చేస్తే ఎప్పటికి గుర్తుంచుకుంటారు కదా అని కామెంట్లు పెడుతున్నారు.