ప్రపంచంలోని మొత్తం 800 కోట్ల జనాభాలో ముస్లిం జనాభా దాదాపు 190 కోట్లు.ఇస్లాం.
ప్రపంచంలో రెండవ అతిపెద్ద మతం.ముస్లిం జనాభా అధికంగా ఉన్నప్పటికీ, మసీదు లేని కొన్ని దేశాలు ప్రపంచంలో ఉన్నాయి.ప్రపంచంలోని మొత్తం 195 దేశాలలో, ముస్లిం ప్రజల ఆరాధన కోసం మసీదు లేని రెండు దేశాలు ఉన్నాయి.ఇక్కడ మసీదు నిర్మించాలనే డిమాండ్‌పై అనేక వివాదాలు ఉన్నాయి.
ఇక్కడ మసీదు నిర్మించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.ఫలితంగా ఇక్కడి ముస్లిం ప్రజలు పలు సాంస్కృతిక కేంద్రాలలో లేదా ఇంట్లో దేవుడిని పూజిస్తుంటారు.
ఐరోపాలోని స్లోవేకియా మరియు ఎస్టోనియాలో ఒక్క మసీదు కూడా లేదు.ప్రపంచంలోని సంతోషకరమైన దేశాలలో ఈ రెండు దేశాల పేర్లు ఉండటం విశేషం.ఈ రెండు దేశాలు ఇటీవలే యూరోపియన్ యూనియన్‌లో కలిశాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం స్లోవేకియాలో ముస్లింల సంఖ్య మొత్తం జనాభాలో 0.2 శాతం మాత్రమే.అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టోనియాలో మొత్తం ముస్లింల సంఖ్య 1508.ఇది దేశంలోని మొత్తం జనాభాలో 0.14 శాతం మాత్రమే.అయితే, గత 10 ఏళ్లలో ఇక్కడ ముస్లిం జనాభా సంఖ్య గణనీయంగా పెరిగింది.అయినా ఇంకా అక్కడ మసీదు నిర్మితంకాలేదు.2010లో స్లోవేకియాలో నివసిస్తున్న ముస్లింలు ఆ దేశ రాజధాని బ్రాటిస్లావాలో మసీదును నిర్మించాలని డిమాండ్ చేశారు.అప్పటి ప్రభుత్వం ముస్లింల డిమాండ్‌ను తిరస్కరించింది.2010 సంవత్సరం తర్వాత కూడా మసీదు నిర్మాణానికి అనేకసార్లు అనుమతి కోరినా ప్రభుత్వం ఆమోదించలేదు.శరణార్థుల సంక్షోభం సమయంలో కూడా స్లోవేకియా ముస్లింలకు ఆశ్రయం ఇవ్వలేదు.
స్లోవేకియా తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా విమర్శలకు దారితీసింది.