అమెరికా దేశం, శాన్ ఫ్రాన్సిస్కో( San Francisco, USA ) నగరంలో నివసించే మేరీ బ్రాన్యస్ మొరేరా( Mary Branius Moreira ) అనే బామ్మ గత వారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.
మరణించే సమయానికి ఆమె వయసు 117 ఏళ్లు.
ఈమె మరణం తర్వాత, జపాన్ దేశానికి చెందిన టోమికో ఇటూకా అనే మరో బామ్మ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా అవతరించారు.ఇప్పుడు ఆమె వయసు 116 ఏళ్లు.
కొత్తగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ దక్కించుకున్న ఆ వృద్ధురాలు వరల్డ్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారారు.ఆమె గురించిన చాలా విశేషాలు కూడా బయటకు వస్తున్నాయి.1908, మే 23న జన్మించిన టోమికో ఇటూకా( Tomiko Ituka ) వయస్సును గెరాన్‌టాలజీ రీసెర్చ్ గ్రూప్ అధికారికంగా ధృవీకరించింది.ప్రస్తుతం ఆమె 116 ఏళ్లు.ఇప్పుడు ఆమె ఒక వృద్ధాశ్రమంలో ఉంటున్నారు.2019 నుంచి ఆమె ఆ నర్సింగ్ హోమ్‌లోనే తల దాచుకుంటున్నారు.అంతకు ముందు, 110 ఏళ్ల వయసు వరకు తన కూతుళ్లతో కలిసి ఇంట్లోనే ఉండేవారు.
టోమికో 20 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నారు.ఆమెకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, ఆమె భర్తకు చెందిన దుస్తుల కర్మాగారాన్ని చాలా బాగా నడిపించారు.
ఆమె 1979లో తన భర్తను కోల్పోయారు.ఆపై తన భర్త స్వగ్రామం నారాలోనే దాదాపు 10 సంవత్సరాలు నివసించారు.హస్బెండ్ చనిపోయినా ఆమె జీవితంలో ఆశను కోల్పోలేదు.
తన జీవితమంతా చాలా చురుగ్గా ఉండేవారు.తన 70వ దశకంలో ఉన్నప్పుడు, నిజో పర్వతాన్ని ఎక్కారు.అంతేకాకుండా, 3067 మీటర్ల ఎత్తున్న "మౌంట్ ఆన్టేక్" ( Mount Ontake )పర్వతాన్ని రెండుసార్లు ఎక్కారు.80 ఏళ్ల వయసులో, 33 బౌద్ధ ఆలయాల గుండా వెళ్ళే కష్టమైన మార్గమైన సైగోకు కన్నోన్ తీర్థయాత్రను రెండుసార్లు పూర్తి చేశారు.100 ఏళ్ల వయసులో, ఆశియా ఆలయంలోని రాతి మెట్లను ఎవరి సహాయం లేకుండా ఎక్కారు.ఆమె కుటుంబం, ఈ రకమైన సాహసయాత్రలు ఆమె ఆరోగ్యంగా ఉండడానికి, ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడ్డాయని నమ్ముతుంది.
2022లో 115 ఏళ్ల వయసులో ఒక మహిళ కన్నుమూసింది, ఆపై టోమికో హైగో ప్రాంతంలోనే అత్యంత వృద్ధురాలిగా మారారు.2023లో, 114 ఏళ్ల వయసులో యాసుయే ఒకై మరణించడంతో, 1908లో జన్మించిన జపాన్ దేశపు చివరి వ్యక్తిగా టోమికో గుర్తింపు పొందారు.ఆమె తన 115వ పుట్టిన రోజును 2023లో జరుపుకున్నారు.రెండు రోజుల తర్వాత హైగో ప్రాంతంలోనే అత్యంత వృద్ధురాలిగా మరొక రికార్డును సృష్టించారు.2023 డిసెంబర్ 12న 116 ఏళ్ల ఫుసా తత్సుమి మరణించిన తర్వాత, టోమికో జపాన్, ఆసియాలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందారు.2024 ప్రారంభంలో, 116 ఏళ్ల ఎడీ సెక్కారెల్లి మరణించిన తర్వాత, టోమికో ప్రపంచంలోనే రెండవ అత్యంత వృద్ధురాలిగా మారారు.టోమికో జన్మించిన సంవత్సరంలోనే రైట్ బ్రదర్స్ విమానంలో ప్రయాణించడం ప్రారంభించారు.
అదే సంవత్సరంలో ఎయిఫెల్ టవర్ నుంచి రేడియో సందేశం పంపించారు.అయితే ఈ వయసులో టోమికోకి కాస్త చెవుడు వచ్చినా బాగానే మాట్లాడుతున్నారని నర్సింగ్ హోమ్ నిర్వాహకులు చెప్పారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy