సరైన వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి ఒకే చోట కూర్చుని పని చేస్తుండడం వల్ల చాలా మంది వెన్ను నొప్పికి ( back pain )గురవుతున్నారు.పోషకాహారం తీసుకోకపోవడం, కనిపించిన జంక్ ఫుడ్ తినడం వల్ల వారి శరీరానికి అవసరమైన పోషకాలు లభించడం లేదు.
కారణాలేవైనా వెన్ను నొప్పితో బాధ పడే వారి సంఖ్య తరచూ పెరుగుతోంది.అయితే దీని నుంచి బయట పడేందుకు సమతుల పోషకాహారం తీసుకోవడం మంచిది.
వాటి గురించి తెలుసుకుందాం.
తరచూ గుడ్లు( Eggs ) తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి.గుడ్లలో ప్రోటీన్‌లు పుష్కలంగా ఉంటాయి.ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి.
విటమిన్ B6, B12, విటమిన్ D వంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి.ఫలితంగా ఎముకలు పటిష్టంగా ఉంటాయి.
వెన్ను నొప్పి సమస్యలు తలెత్తవు.పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి.
వెన్ను నొప్పితో బాధ పడే వారు పసుపును పాలలో( Turmeric in milk ) కలుపుకుని తాగితే శరీరంలో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే పోతాయి.వెన్ను నొప్పిని తగ్గించడంలో అల్లం ( ginger )ప్రభావవంతంగా పని చేస్తుంది.
ఒక టీ స్పూన్ తేనె, రెండు టీస్పూన్ల అల్లం రసం కలుపుకుని తాగుతుంటుంటే ప్రయోజనం ఉంటుంది.డార్క్ చాక్లెట్‌లో ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
డార్క్ చాక్లెట్( Dark chocolate )లోని కోకోలో ఫ్లేవనాయిడ్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి, ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.ముఖ్యంగా వెన్నునొప్పికి ఇవి ఉపశమనం కలిగిస్తాయి.ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకు కూరలలోని విటమిన్ K అధిక మొత్తంలో ఉంటుంది.ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.ముఖ్యంగా బోలు ఎముకల వ్యాధి నుండి ఎముకలను రక్షిస్తాయి.అంతేకాకుండా ఇందులోని ఇన్ఫ్లమేటరీ గుణాలు వ్యాధుల నుండి కాపాడతాయి.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నందున, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ క్యాన్సర్-నివారణ ఉత్తమమైన ఆహారాలలో ఒకటి.