పేదలకు పెడుతుంటే మీకు కడుపుమంట ఎందుకు..: సీఎం జగన్

ఏపీలోని ప్రతిపక్షాలపై సీఎం జగన్ తీవ్రంగా మండిపడ్డారు.పేద పిల్లలకు ట్యాబ్ లు అందిస్తున్నా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

 If You Are Giving To The Poor, Why Do You Feel Sick..: Cm Jagan-TeluguStop.com

అల్లూరి జిల్లా చింతపల్లిలో పర్యటించిన సీఎం జగన్ ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఆయన ట్యాబ్ లను పంపిణీ చేశారు.అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు ట్యాబ్ లు ఇస్తే చెడిపోతారంటూ బురద జల్లుతున్నారన్నారు.మీ పిల్లల చేతుల్లో ట్యాబ్ లు, స్మార్ట్ ఫోన్లు ఉంటే తప్పు కాదా అని ప్రశ్నించారు.మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవొచ్చు కానీ పేదలు చదవకూడదా అని నిలదీశారు.

పేదలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై కుట్ర పూరితంగా బురద జల్లుతున్నారని మండిపడ్డారు.పేదలకు పెడుతుంటే మీకు కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు.

ఓర్వలేక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశామని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99.5 శాతం అమలు చేశామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube