కన్నా ' ను చేర్చుకుంటే ఒడిస్తాం ! ' రాయపాటి ' హెచ్చరిక !?

బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేడు టిడిపి లో చేరనున్నారు.రాజకీయాల్లో సీనియర్ నేత గా ఉన్న ‘ కన్నా ‘ కు గుంటూరు జిల్లా రాజకీయాలతో పాటు , ఏపీ వ్యాప్తంగా మంచి రాజకీయ పరిచయాలు ఉండడం, రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన వ్యక్తిగా మంచి గుర్తింపు ఉండడం, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు కన్నా లక్ష్మీనారాయణ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 If We Include Kanna, We Will Get Rid Of It  Rayapati Warning ,kanna Lakshminaray-TeluguStop.com

రాబోయే ఎన్నికల్లో కన్నా కు కోరిన సీటు ఇవ్వడం తో పాటు , పార్టీలోనూ ప్రాధాన్యం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో ‘ కన్నా ‘ దాదాపు రెండు వేల మంది అనుచరులతో టీడీపీ లో నేడు చేరుతున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నా… కన్నా చేరికను గుంటూరు మాజీ ఎంపీ టీడీపీ నేత రాయపాటి  సాంబశివరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఈ మేరకు ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యు లో రాయపాటి కన్నా వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.‘ కన్నా లక్ష్మీనారాయణ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా, ఓడిస్తామని రాయపాటి అన్నారు.టీడిపిలోకి కన్నా ను తీసుకోవడం చంద్రబాబు తప్ప ఎవరికీ ఇష్టం లేదు.కన్నాను టిడిపిలోకి తీసుకోవడం నాకే కాదు సీనియర్లు అందరికీ సిగ్గేస్తుందని అంటున్నారు’ అంటూ రాయపాటి అన్నారు.

Telugu Chandrababu, Gunturu Mp, Jagan, Ysrcp-Politics

” నేను చాలా అసంతృప్తి తో ఉన్నా.కన్నాను పార్టీలోకి  పెద్ద తెలివి తక్కువ పని.నన్ను , చంద్రబాబును కన్నా  ఎన్నేసి  మాటలు అన్నాడు.కుక్కలు, పందులు, నక్కలు అంటూ వ్యక్తిగతంగా విమర్శలు చేయడంతో పాటు , సామాజికవర్గాన్ని దుమ్మెత్తిపోశాడు.

అలాంటి వ్యక్తిని దగ్గర కు  తీసుకోవడం ఏమిటి ‘ అంటూ రాయపాటి ఫైర్ అయ్యారు.

Telugu Chandrababu, Gunturu Mp, Jagan, Ysrcp-Politics

పార్టీలో ఉన్నవారిని చంద్రబాబు దెబ్బతీయడం ఏమాత్రం సరికాదు.అలా చేయడం తప్పు అన్యాయం.అలా చేసుకుంటూ పోతే పార్టీలో ఎవరు నిలబడతారు ?  ఇలా అయితే నేనిక చంద్రబాబు వద్దకు వెళ్లను.ఎందుకు వెళ్లాలి ?  పార్టీలో మాకు టికెట్ ఇస్తామంటే తప్ప వెళ్లి కలిసేది లేదు.పార్టీలో ఇన్నాళ్లు పనిచేసినా నాకేం చేశారు ? ఏమిచ్చారు అంటూ రాయపాటి ఫైర్ అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube