ప్రస్తుతం ఆన్ లైన్ రంగంలో మాల్వేర్ దాడులు, స్కామ్ లు( Malware attacks, scams ) అధికంగా పెరుగుతూ ఉండడంతో డివైడజ్ సెక్యూరిటీ పై ఆందోళన నెలకొంది.స్కామర్లు ఎప్పుడు హ్యాకింగ్ కి పాల్పడతారో తెలియదు.
మన ఫోన్ లో మాల్వేర్ ఉందా.? లేదా.? ఒకవేళ ఉంటే ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి.క్లీన్ చేసుకునే యాప్ సురక్షితమేనా అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం.

భారత ప్రభుత్వానికి చెందిన సైబర్ స్వచ్ఛతా కేంద్ర పోర్టల్ ఒక సరికొత్త పవర్ఫుల్ టూల్ ప్రవేశపెట్టింది.భారత ప్రభుత్వం ఫ్రీ బోట్ రిమూవల్ టూల్( Free bot removal tool ) తో మాల్వేర్ దాడులకు చెక్ పెట్టనుంది.ఈ టూల్ తో స్మార్ట్ ఫోన్లను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్స్ తెలిపింది.ఈ టూల్ పై పూర్తి అవగాహన పొందడం కోసం భారత ప్రభుత్వం SMS నోటిఫికేషన్ల ద్వారా యూజర్లను అలర్ట్ చేస్తోంది.
ఇక స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న ఎవరైనా కూడా సైబర్ స్వచ్ఛత కేంద్ర పోర్టల్( Cyber Cleanliness Central Portal ) ద్వారా ఉచిత మాల్వేర్ డిటెక్షన్ టూల్స్ ను యాక్సెస్ చేసుకోవచ్చు.ఈ టూల్ ను మాల్వేర్ అనాలసిస్ సెంటర్ లేదా బోట్ నెట్ క్లీనింగ్ అనే పేర్లతో కూడా పిలుస్తారు.

ఈ పోర్టల్, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం నిర్వహణలో ఉంటుంది.ఇక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, యాంటీ వైరస్ ల నుండి సహకారం అందిస్తుంది.వెబ్సైట్ యూజర్లకు వారి సిస్టమ్, డివైజ్లను సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ టూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.స్పామ్ మెసేజ్ పంపడం, అవుట్ గోయింగ్ టెక్స్ట్ లు, ఇన్కమింగ్ టెక్స్ట్ లు, ఫేక్ కాల్స్ చేయడం, నెట్ బ్యాంకింగ్ వివరాలు, యూజర్ నేమ్ లు, పాస్వర్డ్ ల వంటి రహస్య సమాచారాన్ని యాక్సెస్ చేయడం లాంటి హానికరమైన కార్యకర్తలను నిర్వహించకుండా హ్యాకర్లను కంట్రోల్ చేస్తుంది.
స్మార్ట్ ఫోన్లో ఉండే మాల్వేర్ ను తొలగించాలంటే ముందుగా www.CSK.gov.in/ పై క్లిక్ చేయాలి.
ఆ తరువాత సెక్యూరిటీ టూల్స్ క్లిక్ చేసి బాట్ రిమూవల్ టు యాంటీవైరస్ ను ఎంచుకోండి.ఆ తరువాత డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేసి e-scan యాంటీవైరస్ డౌన్లోడ్ చేయాలి.
ఆ తర్వాత గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి eScan CERT-IN Bot Removal సర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి.యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని మీ డివైజ్ తో రన్ చేయండి.
వెంటనే యాప్ మీ డివైజ్ను ను స్కాన్ చేస్తుంది.ఏవైనా వైరస్ ఉంటే తొలగిస్తుంది.
