ఆ రాష్ట్రంలో ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ మంది ఉంటే.. ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు..!!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సరి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు.

యూపీలో ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ మంది ఉంటే వారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులంటూ కొత్త చట్టాన్ని తెచ్చారు.

అంత మాత్రమే కాకుండా స్థానిక ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉండదని ఈ కొత్త చట్టంలో పేర్కొన్నారు.ఇదిలా ఉంటే యోగి సర్కార్ తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

కావాలని ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేసి యోగి ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది అంటూ కొంతమంది వాదిస్తున్నారు.మరోపక్క యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ కొత్త చట్టానిక అదనపు మెరుగులు దిద్దుతూ ఇద్దరు కంటే ఎక్కువ సంతానం కలిగిన తల్లిదండ్రులకు ప్రభుత్వ సబ్సిడీలు వర్తించకుండా అదే రీతిలో ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు కూడా అందకుండా ఈ కొత్త చట్టాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

దీంతో చాలా వరకు ఇది కావాలని.యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొన్ని వర్గాలను టార్గెట్ చేసుకుని రూపొందిస్తున్న చట్టం అంటూ విమర్శలు చేస్తున్నారు.

Advertisement
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు