స్క్రిప్ట్ సెలక్షన్ మార్చుకోకపోతే నితిన్ షెడ్డు కి పోవాల్సిందేనా..?

చాలామంది హీరోలు ఎంత కష్టపడినా కూడా ఒక సక్సెస్ కూడా దక్కడం లేదు.

ఎందుకంటే వాళ్ళు చేసిన సినిమా స్టోరీలో చాలా లోపాలు ఉంటున్నాయి అందువల్లనే సినిమాలు ఆడటం లేదు ఇక ఇలాంటి కోవ కు చెందిన హీరోనే నితిన్.

ఈయన వరుసగా మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయనకు పెద్దగా కాలం కలిసి వచ్చినట్టుగా కనిపించడం లేదు.

ఎందుకంటే ఫ్లాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ( Vakkantham Vamsi)తో చేసిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ( Extra Ordinary Man )సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఆయన ఫ్లాప్ లా పరం పర ని కొనసాగిస్తున్నారు.ఇక వెంకీ కుడుములతో చేస్తున్న సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని నితిన్( Nithiin ) ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఎన్నో ఆశలను పెట్టుకొని వక్కంతం వంశీ డైరెక్షన్ లో నటించిన ఈ సినిమా అనేది నిరశపరచడంతో ఆయన చాలా డిసప్పాయింట్ అయినట్టు గా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో మ్యాటర్ ఏం లేకపోవడంతో సినిమా అనేది ఫ్లాప్ గా ప్రేక్షకులు తెలియజేశారు.

Advertisement

నిజానికి వక్కంతం వంశీ మేకింగ్ కూడా అంత బాగా లేదు దాంతో ఆయనని ఒక మంచి రైటర్ గా చెప్పుకోవచ్చు కానీ, మంచి డైరెక్టర్ కాదు అన్నది మరొకసారి ప్రూవ్ అయింది.ఈ సందర్భంలో చాలామంది విమర్శకులు సైతం నితిన్ ని హెచ్చరిస్తున్నారు మరి ఈ సమయంలో నితిన్ ఎలాంటి సినిమాలు చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది.ఇక మీదట నుంచి ఆయన హీరో గా వచ్చే సినిమాల మీద చాలా కేర్ ఫుల్ గా ఉండాలి లేకపోతే మాత్రం ఆయన సినిమాలు ప్లాప్ అవ్వడం మాత్రం పక్కా అంటూ ఈ సినిమాని ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు.

ఇక ఇదే కారణం తో ఇప్పటికే నితిన్( Nithiin ) విని ఒకే చేసిన కొన్ని ప్రాజెక్ట్ లను హోల్డ్ లో పెట్టినట్టు గా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు