బల్లగోరువు నుండి దాయుత్తి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి.ఐదు సంవత్సరాల నుండి నిధులు మంజూరు అవుతున్న.
రోడ్డు పనులు మాత్రం ప్రారంభం చేయలేదు.రోడ్డు పనులు మొదలు పెట్టకపోతే తేదీ22-11-2022 రిలే నిరాహార దీక్షలు కొండ శిఖర్ గ్రామాలస్తులు తీర్మానం.
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట, పెద్దకోట, జీనపాడు పంచాయతీ పరిధిలో ఓజంగి, పిసు మామిడి, గుమ్మంతి, కరకవలస, గుర్రాల బయలు, కోటగరువు, రాచకిలం, రెడ్డి పాడు, దాయార్థి, మడ్రేబు 11 కొండ శిఖర గ్రామాలకు 1000 మంది జనాభా గ్రామాలకు 2017-18 సంవత్సరంలో1 కోటి36 లక్షలతో ఉపాది హామీ పథకం ద్వారా నిధులు మంజూరైన.ఫారెస్ట్ ఆ అనుమతులు కూడా ఉన్నాయి.ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మట్టి పని మాత్రమే చేశారు.25 లక్షల రూపాయలు నిధులు కాంట్రాక్టర్ కి బిల్లు చేశారు.
ప్రభుత్వం మారిపోవడంతో 2022 సంవత్సరంలో కోటి 20 లక్షల రూపాయలు 7 కిలోమీటర్లకు నిధులు ఉమ్మడి జిల్లా కలెక్టర్ గారు ప్రొసీడ్ ఇన్ ఆర్డర్ ఇచ్చారు.వర్క్ ఆర్డర్ మాత్రం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇచ్చారు.20-3-2022 తేదీ స్థానిక ప్రజాప్రతినిధులు రోడ్డు పనులు ప్రారంభిస్తూ శంకుస్థాపన కూడా చేశారు.నేటికీ ఎనిమిది నెలలు అవుతున్న పనులు మాత్రం ప్రారంభించలేదు.
దీనితో దాయత్తి గ్రామానికి అనుకొని మడ్రేవు మూడు కిలోమీటర్ దూరం గత మూడు నెలల్లో డోలుమూతతో పది కిలోమీటర్లు తీసుకువెళ్లి ఆలస్యం కావడంతో కేజీల మృతి చెందారు.గుమ్మం తి గ్రామం నుండి రాచకీల గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో రెండు నెలల క్రితం అనారోగ్యం గురవతే డోలి మూసుకొని వెళ్లడం అలసమవడంతో.
వీరు కూడా దేవరపల్లి.ఒకరు.
వైజాగ్ టీబీ హాస్పిటల్ లో మృతి చెందారు.ప్రభుత్వం గిరిజనులు డోలు మాటలు అరికట్టాలని (మిషన్ కనెక్ట్ వి పాడేరు) పేరు మీద నిధులు మంజూరు ఎనిమిది నెలలు అవుతున్న.
ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యం వల్ల.వర్షాకాలంలో 2017-18 మట్టి వర్క్ చేసినటువంటి రోడ్డు కొట్టుకుపోయాయి.
దీనితో 11 గ్రామాల ఆదివాసి గిరిజనులు.జ్వరం వచ్చిన అనారోగ్యం వచ్చిన డోలు మోతలు తప్పడం లేదు.
ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన.
ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యం వల్ల.
రోడ్డు పనులు మాత్రం ముందుకు రావడం లేదు.ఇప్పటికైనా వారం రోజుల్లో.
పనులు ప్రారంభించక పోతే.ఈనెల 22వ తేదీ నుండి గుమ్మంతి గ్రామంలో 11 గ్రామాల ఆదివాసులు రిలే నిలహర దీక్షలు చేయాలని నిర్ణయించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి పి న కోట వార్డు సభ్యుడు k జమ్ములు.రాచకీలo.
నుండి గేమ్మిలి జన్మరాజు.కరకవలస నుండి సుబ్బారావు.
మా డ్రబ్ కొండతామల నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం.