టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) ప్రస్తుతం కడప జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.రెండు రోజుల క్రితం మహానాడులో పాల్గొన్న ఆయన వర్షంలో తడిచారు.
దీంతో జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు.ఈ పరిణామంతో వైద్యులు రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించడంతో.
పాదయాత్రకి బ్రేక్ ఇచ్చిన లోకేష్ ఈరోజు సాయంత్రం జమ్మలమడుగు బహిరంగ సభలో మాట్లాడనున్నారు.ఈ క్రమంలో తాజాగా కడప జిల్లాలో వైసీపీ నేతలు( YCP Leaders ) నాకు దమ్కి ఇస్తారా అని.బహిరంగ సభకు ముందు లోకేష్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఆదోనిలో చిన్న ట్రయల్ మాత్రమే చూపించా… ఈసారి అసలు సినిమా చూపిస్తా అని అన్నారు.
ట్రయల్ మేనిఫెస్టో( Manifesto )కే వైసీపీ భయపడుతోంది.ఫుల్ మేనిఫెస్టో ప్రకటిస్తే వైసీపీ దుకాణం సర్దుకోవాల్సిందే.
మాయమాటలతో వైసీపీ అధికారంలోకి వచ్చింది అంటూ లోకేష్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.రాజమండ్రిలో జరిగిన మహానాడు వేదిక( Mahandu )గా చంద్రబాబు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ తొలి విడత మేనిఫెస్టో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఈ మేనిఫెస్టోలో మహిళలకు.నిరుద్యోగులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సంచలన హామీలు ఇవ్వడం జరిగింది.
సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన ఈ హామీలు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారాయి.