దేశ ప్రధాని మోడీ రెండు రోజుల కిందట తెలంగాణలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.తొలుత ఇక్రిశాట్ స్వర్నోత్సవాల్లో పాల్గొన్నారు.
అనంతరం ముచ్చింతల్‌లోని రామానుజాచార్య విగ్రహం ఆవిష్కరించారు.ఇది అందరికి తెలిసిన విషయమే.
కానీ, ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కాలేదు.ఇది చర్చణీయాంశంగా మారింది.
అంతకుముందు కూడా రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో జరిగిన జాతీయ పతాకావిష్కరనలోనూ పాల్గొనలేదు.అలాగే బడ్జెట్ విషయంలోనూ కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ మోడీని ఏకిపారేశారు.
అయితే మోడీ చేపట్టిన కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గనకపోవడంతో బీజేపీ నేతలు ఒక రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.
ఒకదేశ ప్రధాని తెలంగాణలో పర్యటనకు వస్తే పట్టించుకోకుండా మోడీని అవమాన పర్చారు అంటూ గగ్గోలుపెడుతున్నారు.
ప్రధాని హోదాలో ఉన్నమోడీని సీఎం స్థానంలో ఉన్న కేసీఆర్ పట్టనట్టు వ్యహరించడాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు.రావాలనుకునే ఉద్ధేశం ఉంటే కనీసం మోడీని కలిసి వెళ్లేవారు కదా….
అంటూ మండిపడుతున్నారు.మోడీ పట్ల ఉద్ధేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అంటున్నారు.
బీజేపీ నేతలు ప్రోటోకాల్ విషయంలో సీఎం కేసీఆర్‌పై ప్రశ్నల తూటాలు పేలుస్తున్నారు.మరికొందరు ఔత్సాహికులు కూడా కేసీఆర్‌పై ప్రశ్నల్ని సంధిస్తున్నారు.
ఒకవేళ మోడీని కలిసేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు సీఎం కేసీఆర్‌కు కుదరకుంటే మంత్రి హోదాలో ఉన్న ఆయన కుమారుడు కేటీఆర్‌ను అయినా పంపించొచ్చు కదా అంటూ లాజిక్ గా ప్రశ్నలు వేస్తున్నారు.తరచూ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు తదిర వాటిల్లో చురుగ్గా పాల్గొంటున్న కేటీఆర్‌కు ఏమైందని అని అంటున్నారు.
కనీసం కేటీఆర్ అయినా మోడీకి స్వాగతం పలకొచ్చు కదా అంటున్నారు.ఇదే సందేహం అందరిలోను మెదులుతోంది.
ప్రధానమంత్రి స్థాయి నేతలు రాష్ట్ర పర్యటనకు రానున్న నేపథ్యంలో స్వాగతం పలికే ప్రముఖుల జాబితాను పీఎం ఆఫీస్‌కు ముందే పంపుతారు.వీడ్కోలుకు సంబంధించి ఎవరెవరు పాల్గొంటారో ముందస్తు అనుమమతి తీసుకోవాలి.ఈ అంశాలపైనే పీఎంఓకు జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పంపింది.ఇందులో మినిస్టర్ ఆఫ్ వెయిటింగ్ అన్న పేరుతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు ఉంది.ఇందులో కేటీఆర్ పేరు లేదు.లేదంటే కేటీఆర్ మోడీనీ కలిసే వారంటూ పలువురు ట్రోల్ చేయడం గమనార్హం.