సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రకుల్ ప్రీతిసింగ్ (Rakul Preeth Singh) ఒకరు.కెరియర్ మొదట్లో తెలుగు తమిళ భాషలలో సినిమాలుచేస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె అనంతరం బాలీవుడ్ అవకాశాలను అందుకున్నారు.
ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమయ్యారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలోని వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇంటర్వ్యూ సందర్భంగా రకుల్ ప్రీతిసింగ్ తన కెరియర్ గురించి పలు విషయాలను తెలియజేశారు.తనకు సినిమా అవకాశాలు (Movie Chance) రావాలంటే ముందుగా మోడల్ అవ్వాలని, ఇలా మోడల్ గా మారి మిస్ ఇండియా పోటీలలో సెలెక్ట్ అయితే మంచి గుర్తింపు లభించి తద్వారా సినిమా అవకాశాలు వస్తాయని భావించానని ఈమె తెలియజేశారు.
ప్రస్తుతం సినిమా రంగంపై ఆసక్తి ఉన్నవారికి కూడా తాను ఇదే సలహా ఇస్తానని తెలియజేశారు.ఇక తాను కూడా కొన్ని ప్రణాళికలతో ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేశానని తెలిపారు.

ఒకవేళ తనకు అనుకున్న సమయంలో అనుకున్న విధంగా సినిమా అవకాశాలు కనుక రాకపోయి ఉంటే తను ప్లాన్ బీ (Plan B) అమలు చేసేదానినని తెలియజేశారు.తనకు కనుక సినిమా అవకాశాలు రాకపోయి ఉంటే ఎంబీఏ (ఫ్యాషన్) చేయాలని నిర్ణయించుకున్నానని ఈమె తెలియజేశారు.అలా సినిమాలలోకి కనక రాకపోయి ఉంటే తాను ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో స్థిరపడి ఉండే దానిని తెలియజేశారు.అయితే తనకు ఆ అవకాశం లేకుండా అనుకున్న సమయానికి సినిమా అవకాశాలు వచ్చాయని ఈమె తెలిపారు.
తాను మాథ్స్ లో గ్రాడ్యుయేషన్ (Maths Graduation) పూర్తి చేసానని 18 సంవత్సరాల వయసులోనే తనకు సినిమా అవకాశాలు వచ్చాయని ఈ సందర్భంగా రకుల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
