తెలంగాణలో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komatireddy Venkat Reddy ) అన్నారు.రెండు లేదా మూడు సీట్లు బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు.
ఇక బీఆర్ఎస్ కు( BRS ) ఒక్క సీట్ కూడా రావడం కష్టమేనని పేర్కొన్నారు.మెదక్ లో బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.ఈ నేపథ్యంలోనే ఏ ముఖం పెట్టుకొని మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర( KCR Bus Yatra ) చేపడుతున్నారని ప్రశ్నించారు.
దేశంలో మత ఘర్షణలు చెలరేగేలా మోదీ మాట్లాడటం బాధాకరమని చెప్పారు.మొదటి దశ ఎన్నికల్లో ఇండియా కూటమికే( INDIA Alliance ) ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఉత్తర భారత్ లో బీజేపీ పరిస్థితి బాగలేదన్న మంత్రి కోమటిరెడ్డి అందుకే దక్షిణ భారత్ పై ఫోకస్ పెట్టారని తెలిపారు.బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్న ఆయన తాను పిలిస్తే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని తెలిపారు.







