హంగ్ వస్తే.. అధికారం ఎవరిది ?

తెలంగాణలో ఎన్నికలు( Telangana Elections ) దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ అంచనాలు ఎప్పటికప్పుడు తారుమారు అవుతున్నాయి.

గెలుపోటములను అంచనా వేస్తూ ఇప్పటికే చాలా సర్వేలు బయటకు వచ్చాయి.

అయితే ఎన్ని సర్వేలు వచ్చిన అధికారంలోకి వచ్చే పార్టీ విషయంలో కన్ఫ్యూజన్ మాత్రం తొలగిపోవడం లేదు.ఎందుకంటే కొన్ని సర్వేలు అధికార బి‌ఆర్‌ఎస్( BRS ) కు అనుకూలంగా వెలువడుతుంటే మరికొన్ని సర్వేలు కాంగ్రెస్( Congress party ) కు ఫేవర్ గా కనిపిస్తున్నాయి.

ఇలా ఏ పార్టీకి స్పస్తమైన అధికారాన్ని కట్టబెట్టడం లేదు సర్వే సంస్థలు.విశ్లేషకులు సైతం స్పష్టమైన అధికారాన్ని అంచనా వేయలేక పోతున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల తీర్పు ఈసారి భిన్నంగా ఉండబోతుందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.అందులో భాగంగానే హంగ్ రావచ్చనే అభిప్రాయాన్ని కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారు.దీంతో ఒకవేళ హంగ్ ఏర్పడితే ఇతర పార్టీల మద్దతు తప్పనిసరి.

Advertisement

ప్రస్తుతం రేస్ లో ఉన్న ప్రధాన పార్టీలైన బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి లు బద్ద శతృత్వం కలిగిన పార్టీలుగా కత్తులు దూసుకుంటున్నాయి.బి‌ఆర్‌ఎస్ బిజెపి మద్య అంతర్గత పొత్తు ఉందని కాంగ్రెస్ విమర్శిస్తుంటే.

లేదు లేదు కాంగ్రెస్ బీజేపీ మద్యనే పొత్తు కొనసాగుతోందని బి‌ఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.

ఇక బీజేపీ( BJP ) నేతలెమో కాంగ్రెస్ బి‌ఆర్‌ఎస్ కు దోస్తీ అని చెబుతున్నారు.ఇలా మూడు పార్టీలు త్రిముఖంగా వేలెత్తి చూపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఒకవేళ హంగ్ ఏర్పడితే రాజకీయాలు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ తరువాత కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సొంతం చేసుకునే అవకాశం ఉంది.బీజేపీ మూడో స్థానానికి పరిమితం అయిన ఆశ్చర్యం లేదు.ఈ నేపథ్యంలో అధికారం కోసం బి‌ఆర్‌ఎస్ బీజేపీ జట్టు కట్టిన ఆశ్చర్యం లేదనేది బీజేపీ నేతలు చేస్తున్నవిమర్శ.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

అటు కాంగ్రెస్ కూడా ఇదే తరలోనే వ్యాఖ్యానిస్తోంది.దీంతో హంగ్ ఏర్పడితే గందరగోళ పరిస్థితులు ఏర్పడడం ఖాయం అని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

మరి ఏం జరుగుతుందో చూడాలి.

తాజా వార్తలు