బీజేపీ ' బండి 'కి ఎన్ని ఇబ్బందులో ? ఆయన చేరితే మరీ ఇబ్బంది ?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ పేరు నిన్నా, మొన్నటి వరకు మారుమోగుతూ వచ్చింది.

ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీజేపీకి ఒక రకమైన ఊపు వచ్చింది.

పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు కనిపించాయి.టిఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తి లతో పాటు కాంగ్రెస్ లోని ఎంతోమది నాయకులుబండి సంజయ్ పిలుపుమేరకు బిజెపి లో చేరిపోయారు.

అంతేకాదు దుబ్బాక లో ప్రతిష్టాత్మకంగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచేందుకు బండి సంజయ్ వ్యూహాలు బాగా పనిచేశాయి.ఆ విజయం తో పాటు , గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు బిజెపికి రావడంతో సంజయ్ పై అధిష్టానం పెద్దలకు నమ్మకాలు పెరిగిపోయాయి.

  అయితే ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ , నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కానీ, ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభావం కనిపించలేదు.దీనికితోడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ రెండు వర్గాలుగా ఉన్నట్లుగా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

దీనికితోడు సంజయ్ హడావుడి పెద్దగా కనిపించడం లేదు.

మొన్నటివరకు టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేసిన కేసీఆర్ సైతం బిజెపి విధానాలను అప్పుడప్పుడు సమర్థించడమే కాకుండా,  కేంద్రం అమలు చేస్తున్న పథకాలను తెలంగాణలోని అమలు చేస్తుండటంతో వాటి పై విమర్శలు చేయలేక సంజయ్ సైలెంట్ అయిపోయారు.  దీంతో బీజేపీ కి తెలంగాణలో కాస్త తగ్గింది అన్నట్లుగా వ్యవహారం కనిపిస్తుండగానే, ఇప్పుడు ఉద్యమ నేపథ్యం ఉన్న ఈటెల బీజేపీ లో చేరబోతుండడం, బీజేపీ కేంద్ర పెద్దలు సైతం ఆయనకు ప్రాధాన్యం ఇస్తూ ఉండడం, కీలకమైన పదవి రాజేందర్ కు దక్కబోతూ ఉండడం తో బండి సంజయ్ హవా కు క్రమ క్రమంగా బీటలు పడేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.ముందు ముందు తెలంగాణ బిజెపి లో ఈటెల కీలకం కాబోతుండడం కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదు.

   .

జగన్ అరెస్ట్ కు షర్మిల డిమాండ్ .. వైసీపీ కౌంటర్ ఇదే 
Advertisement

తాజా వార్తలు