Dosa crop : వేసవికాలంలో దోస పంట సాగు చేస్తే శ్రమ తక్కువ, ఆదాయం ఎక్కువ..!

వేసవికాలంలో రైతులు దోస పంట సాగు( Cultivation of Dosa crop ) చేస్తే తక్కువ శ్రమతో అధిక దిగుబడి సాధించి మంచి ఆదాయం పొందవచ్చు.

ఎందుకంటే.

దోస పంట సాగుకు రసాయన ఎరువుల( Chemical fertilizers ) వినియోగం ఉండదు.కాబట్టి ఈ పంట సాగుకు పెట్టుబడి వ్యయం చాలా అంటే చాలా తక్కువ.

దోస పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే.సేంద్రియ ఎరువులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు డ్రిప్ విధానం ద్వారా నీటిని అందించాలి.

పొలంలో కలుపు సమస్య లేకుండా చూసుకోవాలి.అంతే మంచి దిగుబడి పొందవచ్చు.

Advertisement

తక్కువ నీటి వనరులు ఉండే ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేయవచ్చు.

తెగులు నిరోధక మేలురకం విత్తనాలను సాగుకు ఎంపిక చేసుకోవాలి.ఒక ఎకరాకు 1.5 కిలోల విత్తనాలు( seeds ) అవసరం.విత్తనాలను ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి.

ఒక కిలో విత్తనాలకు మూడు గ్రాముల థైరం( Thyrum ) తో విత్తన శుద్ధి చేసుకోవాలి.ఇక ఒక ఎకరాకు ఐదు టన్నుల పశువుల ఎరువు ( cattle manure )తో పాటు పది కిలోల బోరాన్ ను వేసి పొలాన్ని కలియ దున్నుకోవాలి.

మొక్కల మధ్య, మొక్కల వరుసల మధ్య కాస్త అధిక దూరం ఉండేటట్లు నాటుకోవాలి.అప్పుడే మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.పొలంలో కలుపు సమస్య ఉంటే వివిధ రకాల చీడపీడల, తెగుళ్ల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
సెనేట్ ఆమోదం లేకుండానే కేబినెట్ నియామకాలు.. ట్రంప్ వ్యూహాత్మక ఎత్తుగడ

కాబట్టి కలుపు ఎప్పటికప్పుడు తొలగిస్తే దాదాపుగా పెట్టుబడి వ్యయం తగ్గినట్టే.నేలలోని తేమ సుభావాన్ని బట్టి పది రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి.దోస పంట విత్తిన 45 రోజులకే కోతకు వస్తుంది.

Advertisement

ఇక వారానికి రెండు కోతలు తీసుకోవచ్చు.

తాజా వార్తలు