కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ ఆ పార్టీలోనే ఉంటారా..?: మందకృష్ణ

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మార్ఫీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు.రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తామంటే ఏం విధంగా నమ్మాలని ప్రశ్నించారు.

ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ ఆ పార్టీలోనే ఉంటారా అన్న మందకృష్ణ రేవంత్ ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదని విమర్శించారు.రేవంత్ మాటకు విలువ లేదన్నారు.

తన ఎదుగుదల కోసం రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తారని చెప్పారు.ఈ క్రమంలోనే ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేత లెటర్ రాయమని కోరినా సమాధానం లేదని తెలిపారు.

కేంద్రంపై ఒత్తిడి పడాలంటే ప్రతిపక్షం ఒత్తిడి చేయాలని పేర్కొన్నారు.కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

Advertisement

రెండు నిమిషాలు మాట్లాడే ఓపిక లేదన్న ఆయన తమ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తారా అని ప్రశ్నించారు.

తన కొడుకుతోపాటు మరో యంగ్ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాధ్...
Advertisement

తాజా వార్తలు