ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ఈ విషయం గురించి రాజకీయ విశ్లేషకులు, ప్రజలు చర్చించుకుంటున్నారు.మరి చంద్రబాబు ( Chandrababu ) వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే నింద ఎవరిపై వేస్తారు.
నిజంగానే ఆ వ్యక్తి వల్లే మా పార్టీ ఓడిపోయిందని చెబుతారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.చంద్రబాబు నాయుడు జనసేన కూటమి తో పొత్తు పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే వచ్చే ఎన్నికల్లో గనుక తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఖచ్చితంగా ఆ నింద మొత్తం పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) పైనే వేస్తారు అని రాజకీయ విశ్లేషకులతో పాటు ప్రజలు కూడా భావిస్తున్నారు.ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇది కొత్తేమీ కాదు.
ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఓడిపోయిన ప్రతిసారి ఎవరో ఒకరి మీద నింద వేసేస్తారు.

అలా 2004లో టిడిపి ఓడిపోతే బిజెపి పార్టీపై నింద వేశాడు.అలాగే 2009లో ఓడిపోతే టిఆర్ఎస్ ( TRS ) అలాగే కమ్యూనిస్టు పార్టీల వల్లే మా పార్టీ ఓడిపోయిందని చెప్పారు.ఇక 2014లో మాత్రం చంద్రబాబునాయుడు గెలిచారు.
ఆ సమయంలో పవన్ కళ్యాణ్ అలాగే బిజెపి పార్టీ వల్ల ఈయన గెలుపు సాధ్యమైంది.కానీ గెలిచాక మాత్రం మాట మార్చారు.
బిజెపి పార్టీపై, మోడీపై విమర్శలు గుప్పించారు.దాంతో చంద్రబాబు నిజ స్వరూపం బయటపడింది.
ఇక దాంతో 2019 ఎన్నికల్లో ఈయన మళ్ళీ ఓడిపోయారు.

అయితే ఓడిపోయిన ప్రతిసారి ఏదో ఒక పార్టీ మీద నింద వేయడం చంద్రబాబుకి అలవాటు అయిపోయింది.ఇక ఈసారి ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఓడిపోతే కచ్చితంగా పవన్ కళ్యాణ్ మీదే ఆ నింద మొత్తం వేస్తారని అందరూ భావిస్తున్నారు.చంద్రబాబు నాయుడుకి తన సొంత కుటుంబ సభ్యులకే వెన్నుపోటు పొడిచారు.
అలాంటిది పవన్ కళ్యాణ్ అంటే ఒక లెక్కనా అని మాట్లాడుకుంటున్నారు.అంతేకాదు పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) సినిమా వస్తేనే చంద్రబాబు సామాజికవర్గం వాళ్లకి నచ్చదు.
అలాంటిది పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవడానికి కొంతమంది వ్యతిరేకించారు కానీ బయటికి చెప్పలేదు.ఇక పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు కేవలం ఎన్నికల్లో ఒక పావుగా మాత్రమే వాడుకుంటున్నారు.
ఒకవేళ తమకి తక్కువ సీట్లు వస్తే పవన్ కళ్యాణ్ ని వాడుకోవాలి అనే దుర్బుద్ధితోనే చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు.ఇలా ఎన్ని సంవత్సరాలు చంద్రబాబు పల్లకిని పవన్ కళ్యాణ్ మోసినప్పటికీ కూడా చంద్రబాబు ఆయనకి క్రెడిట్ ఇవ్వరనేది జగమెరిగిన సత్యం.