గడ్డంతో గిన్నిస్ రికార్డుకెక్కిన యువకుడు!

యూత్‌కి ఇపుడు గడ్డం ట్రెండ్ అని చెప్పుకోవాలి.ఒకప్పుడు క్లీన్ షేవ్ చేసుకుంటేగాని బయటకు వెళ్లేవారు కాదు.

అయితే నేడు గడ్డం లేనిదే బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి.ఒకప్పుడు పెళ్లి వేడుకలో క్లీన్ షేవ్ తోనే పెళ్లిపీటలపై కూర్చునేవారు.

కానీ ఇపుడు పెళ్లి కూతుళ్లే పెళ్లి కొడుక్కి గడ్డం అడ్డం కాదు గాని అని అనడం కొసమెరుపు.అయితే ఇపుడు ఈ తంతంతా ఎందుకు అని అనుకుంటున్నారా? నేటి యువత ఇపుడు గడ్డాన్ని అడ్డం పెట్టుకొని గిన్నిస్ రికార్డులు కొట్టేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక ఔత్సాహికుడు గడ్డంతో 9 గిన్నిస్‌ రికార్డులు కొట్టి పారేసాడు మరి.అమెరికాలోని ఇడాహోకు చెందిన జోయల్‌ స్ట్రాసర్‌ అనే వ్యక్తి తన గడ్డాన్ని మొదటినుండి అపురూపంగా చూసుకునేవాడు.ఇరుగుపొరుగు వారు అదోలా చూసినా సరే నవ్విన నాప చేనే పండుతుంది అన్న మాదిరి నిత్యం ఎంతో అందంగా అలంకరించుకొనేవాడు.

ఇక గడ్డం ఆరోగ్యం కోసం అయితే ఎన్నో ప్రత్యేక చర్యలు తీసుకునేవాడు.ఇక అంత ప్రేమగా పెంచుకుంటే ఆ గడ్డం ఋణం తీర్చుకోవాలని అనుకుందేమోగాని, ఆయనకు ఏకంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులను తెచ్చిపెట్టింది.

Advertisement

గడిచిన మూడు సంవత్సరాలుగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు సాధిస్తున్న జోయల్‌ స్ట్రాసర్‌.తాజాగా 710 బబుల్స్‌తో తన రికార్డును మరోసారి తానే బద్దలు కొట్టడం కొసమెరుపు.తొలిసారి 2019 లో 302 బబుల్స్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కిన స్ట్రాసర్‌.

ఆ నెక్స్ట్ ఏడాదే 542 బబుల్స్‌తో. రికార్డు సాధించాడు.అంతటితో వూరుకున్నాడా అంటే పొరపాటే.2021 లో 686 బబుల్స్‌తో మరలా తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు.ఇక తాజాగా క్రిస్మస్‌ వేళ తన గడ్డాన్ని క్రిస్మస్‌ చెట్టుకు అలంకరించే వస్తువులతో అందంగా తీర్చిదిద్ది నెటిజెన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.

Advertisement

తాజా వార్తలు