వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ విషయమై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden) తనదైన శైలిలో స్పందించడం ఇపుడు అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్ అయింది.ఆయనపై విషప్రయోగం జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేసారు.
ఇటీవల ప్రిగోజిన్ చేసిన తిరుగుబాటు, ఆ తర్వాత పరిణామాలను ఉద్దేశించి బైడెన్ ఈ విధంగా స్పందించడం కొసమెరుపు.ఓ వేదికపై ఆయన మాట్లాడుతూ… “ప్రిగోజిన్( Prigozhin ) ఎక్కడున్నారో అమెరికాకు కూడా తెలీదు అంటే మీరు నమ్ముతారా? అతడి స్థానంలో నేనుంటే.నేను తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొనేవాడిని!” అంటూ ప్రిగోజిన్‌పై విష ప్రయోగం జరగొచ్చేమోనన్న సందేహాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు.ఇంకా ఆయన మాట్లాడుతూ… “ఇక సరదా మాటలు పక్కన పెడితే.
రష్యాలో ప్రిగోజిన్ భవిష్యత్తు ఏంటో ఎవరికీ కచ్చితంగా తెలీదని నేను అనుకుంటున్నాను!” అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ కి చురకలు అంటించారు.
ఇకపోతే, ష్యా సైన్యంతో కలిసి ఉక్రెయిన్ యద్ధంలో పోరాడుతోన్న వాగ్నర్ గ్రూప్.జూన్ 24న తిరుగుబాటుకు దిగిన విషయం అందరికీ తెలిసిందే.దానిలో భాగంగా రొస్తోవ్-ఆన్-డాన్ నగరంలోని రష్యా సైనిక కార్యాలయాన్ని ఆధీనంలోకి తీసుకుంది.
ఆ తరువాత మాస్కోలోని సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.అయితే బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వంతో ఈ తిరుగుబాటు ఆగిపోయింది.దీని తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ – ప్రిగోజిన్ మధ్య సిదిర్ఘ చర్చలు జరిగాయి.తర్వాత పుతిన్( Vladimir Puti) ఓ పత్రికతో మాట్లాడుతూ.“వాగ్నర్ పీఎంసీ అనేది లేదు.మా చట్టాలు ప్రైవేటు సైన్యాలకు అస్సలు అనుమతి ఇవ్వవు.
వాస్తవానికి వాగ్నర్ గ్రూపు అనేది ఉంది.కానీ, చట్టం దృష్టిలో మాత్రం దానికి ఎటువంటి గుర్తింపు లేదు.
దీనిని చట్టపరం చేయడం ఓ ప్రత్యేకమైన విషయం.ఆ విషయాన్ని స్టేట్ డూమా చర్చించాల్సి ఉంటుంది!” అని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యల తరువాత వాగ్నర్ బాధ్యతల నుంచి ప్రిగోజిన్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.మరోవైపు.ప్రిగోజిన్‌పై విష ప్రయోగం జరగొచ్చని గతంలోనూ ఊహాగానాలు వినిపించాయి.ఆ మధ్య పుతిన్‌ను ఎదిరించిన ప్రతిపక్ష నేత అలెక్సీ నవానీ సహా కొందరిపై విషప్రయోగం జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే బైడెన్ దీనిపై స్పందించారు.ఈ విషయంపైన మొన్నటికి మొన్న ఉక్రెయిన్ అధినేత కూడా మాట్లాడుతూ వాగ్నర్ బాస్ ని రష్యా సైన్యం ఎప్పుడో అంతమొందించి ఉంటుందని సంచలన ప్రకటన చేసిన సంగతి అందరికీ విదితమే.
ఇక తాజాగా బైడెన్ ఈ విషయంపైన సందేహం లేవనెత్తడంతో ఈ విషయం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది.