మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన ఐకాన్ స్టార్.. ఇక వార్ లేనట్టేనా?

ఈ ఈవెంట్ లో అల్లు ఫ్యామిలీతో మెగా ఫ్యామిలీ ఎలా ఉంటుందో వారి మధ్య బంధం ఎలా ఉంటుందో చూపించారు.అల్లు ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ మీద చూపించిన అభిమానం మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఒక్కటి కాదు వేరు వేరు అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.

 Icon Star Allu Arjun Superb Speech At Allu Ramalingaiah Book Launch Details, Ico-TeluguStop.com

ఇక ఈ ప్రచారాన్ని నిజం చేసేలా పరిస్థితులు కూడా మారిపోవడంతో అంతా నిజమనే అనుకున్నారు.దీంతో ఇరు కుటుంబాల ఫ్యాన్స్ ప్రతీ విషయంలో వార్ జరుపుతూనే ఉన్నారు.

అసలు ఇలా ఒక ప్రచారం బయటకు రావడానికి కారణం అల్లు అర్జున్ అనే చెప్పాలి.ఈయన ఒక ఈవెంట్ లో పవన్ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు చెప్పను బ్రదర్ అంటూ చేసిన కామెంట్స్ రచ్చ రచ్చ చేసాయి.

 Icon Star Allu Arjun Superb Speech At Allu Ramalingaiah Book Launch Details, Ico-TeluguStop.com

ఇక అప్పటి నుండి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య వార్ నడుస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య కూడా వార్ నడిచింది.అయితే తాజాగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య క్లాష్ కు క్లారిటీ ఇచ్చేసారు.

అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా అల్లు స్టూడియోస్ ను ఘనంగా ప్రారంభం చేసారు.మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ చేతుల మీదుగా ఈ స్టూడియో గ్రాండ్ గా ఓపెనింగ్ జరిగింది.

ఈ ఈవెంట్ లో అల్లు ఫ్యామిలీతో మెగా ఫ్యామిలీ ఎలా ఉంటుందో వారి మధ్య బంధం ఎలా ఉంటుందో చూపించారు.అల్లు ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ మీద చూపించిన అభిమానం చూసి వార్ అనేది ఏదీ లేదు అని క్లారిటీ వచ్చింది.

ఇక ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు కూడా పలువురిని ఆకట్టు కుంది.ఈ సందర్భంగా బన్నీ మాట్లాడిన మాటలు కూడా వైరల్ అయ్యాయి.చిరంజీవి గారు అల్లుడిగా రావడం వల్లే తన తాత స్థాయి ఇమేజ్ పెరిగింది అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు.ఈ మాటలు విన్న వారంతా తమ ఫ్యామిలీ ఎదుగుదల విషయంలో చిరంజీవి పాత్ర చాలా ఉంది అని బన్నీ ఒప్పుకున్నట్టు అనిపిస్తుంది అని అంతా కామెంట్స్ చేస్తున్నారు.

ముఖ్యంగా ఈయన మాటలకూ మెగా ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.దీంతో ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్ అన్నిటికి క్లారిటీ వచ్చింది.మరి ఇప్పటికైనా ఫ్యాన్స్ అలా వాదించు కోవడం ఆపేయడం మంచిది అని కొంత మంది హితబోధ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube