నేడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్..ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయంటే..?

వన్డే ప్రపంచ కప్ లో( ODI World Cup ) భాగంగా నేడు లక్నో వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్( Ind vs Eng ) ఉత్కంఠ భరిత మ్యాచ్ జరగనుంది.

భారత్ సొంత గడ్డపై ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లలో వరుస విజయాలను ఖాతాలో వేసుకుంది.

డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఈ టోర్నీలో పసికూన జట్ల కంటే ఘోరంగా ఓటమిలను చవిచూస్తోంది.ఇంగ్లాండ్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లలో కేవలం ఒక మ్యాచ్ లో గెలిచి ఏకంగా నాలుగు మ్యాచ్లలో ఓడిన సంగతి తెలిసిందే.

ఇంగ్లాండ్ జట్టు సెమీస్ చేరే దారులన్నీ దాదాపుగా మూసుకుపోయాయి.కానీ కనీసం కొన్ని మ్యాచ్లలో గెలిస్తే పరువు దక్కుతుంది.

కాబట్టి ఇంగ్లాండ్( England ) ఆడాల్సి ఉన్న మిగతా నాలుగు మ్యాచ్లు కాస్త కీలకం అనే చెప్పాలి.భారత్, ఇంగ్లాండ్ మధ్య ఇప్పటివరకు 106 వన్డే మ్యాచ్లు జరగగా.

Advertisement

భారత్ 57, ఇంగ్లాండ్ 44 మ్యాచ్లలో విజయం సాధించాయి.ప్రపంచ కప్ లో మాత్రం ఇంగ్లాండ్ దే ఆధిపత్యం.2003 తర్వాత భారత్( india ) 2007, 2011, 2015, 2019 ప్రపంచ కప్ లలో ఇంగ్లాండ్ చేతిలో వరుసగా ఓటమిని చవిచూసింది.

భారత జట్టు బ్యాటింగ్ విషయానికి వస్తే.కెప్టెన్ రోహిత్ శర్మ తో( Rohit Sharma ) పాటు విరాట్ కోహ్లీ,( Virat Kohli ) కేఎల్ రాహుల్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు.శుబ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఆశించిన స్థాయిలో కాకుండా ఒక రకంగా బాగానే రాణిస్తున్నారు.

హార్దిక్ పాండ్యాకు గాయం కావడం వల్ల అతని స్థానంలో సూర్య కుమార్ యాదవ్ కు( Surya Kumar Yadav ) చోటు లభించింది.సూర్య కుమార్ యాదవ్ తనను తాను నిరూపించుకోవాల్సిన మంచి సమయం ఇదే.భారత జట్టు బౌలింగ్ విషయానికి వస్తే.

బుమ్రా, మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ చాలా చక్కగా రాణిస్తున్నారు.ఇక మహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ లలో ఎవరో ఒకరికి చోటు దక్కుతుంది.ఇంగ్లాండ్ జట్టు విషయానికి వస్తే.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

బట్లర్,( Buttler ) రూట్,( joe Root ) బెయిర్ స్టో లు ఈ టోర్నీలో పేలవ ఆటను ప్రదర్శిస్తూ ఇంగ్లాండ్ జట్టుకు ఒక పెద్ద మైనస్ గా మారారు.కాబట్టి ఇంగ్లాండ్ జట్టు ఆల్ రౌండర్ లైన వోక్స్, విల్లీ, అట్కిన్సన్ లపై ఆధారపడింది.

Advertisement

పిచ్ విషయానికి వస్తే.లక్నో పిచ్ స్పిన్నర్లకు అనుకూలం.

బౌలింగ్ కు అనుకూలమైన పిచ్ కాబట్టి రెండు జట్లు భారీ స్కోర్లు చేసే అవకాశం లేకపోవచ్చు.

తాజా వార్తలు