ఐపీఎల్‌కు ఐసీసీ అగ్రతాంబూలం.. ఎఫ్‌టీపీలో చోటు

భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ఐసీసీకి భారత్ నుంచే అత్యధిక ఆదాయం లభిస్తోంది.

 Icc Is Top Priority For Ipl Place In Ftp , Ipl, Icc, Ftb, New Record, Sports Up-TeluguStop.com

దీంతో భారత్‌లో క్రికెట్ అభివృద్ధికి తీసుకునే చర్యలకు ఐసీసీ తప్పక గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది.ఇక భారత క్రికెట్ బోర్డు బీసీసీఐకు ఆదాయంలో సింహ భాగం ఐపీఎల్ నుంచే వస్తుంది.

ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఐపీఎల్‌ను మరింత అభివృద్ధి చేస్తోంది బీసీసీఐ.తాజాగా ఐపీఎల్‌లో మ్యాచ్‌ల సంఖ్య పెంచడం, మరో రెండు కొత్త జట్లును చేర్చుకోవడం వంటివి ఆ కోవలోకే వస్తాయి.

ఈ తరుణంలో బీసీసీఐ కార్యదర్శి జై షా ఊహించినట్లే ఇటీవల ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది.అది ఐపీఎల్ మరింత ఆకర్షణీయంగా ఉండేలా లాభిస్తుంది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

బీసీసీఐ ఇటీవల ఐపీఎల్‌ను 10 జట్లకు విస్తరించనున్నట్లు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ల సంఖ్య ఈ ఏడాది 74కు చేరింది.ఇది క్రమంగా 2027 నాటికి 94 మ్యాచ్‌లకు పెరుగుతుంది.

ఇటువంటి తరుణంలో ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లు ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటారు.ఐపీఎల్ జరిగే సమయంలోనే ఆయా దేశాల తరుపున విదేశీ ఆటగాళ్లు ఆడుతుంటే ఇబ్బంది ఎదురవుతుంది.

విదేశీ ఆటగాళ్లు లేకపోతే ఐపీఎల్‌కు కళ తప్పుతోంది.అయితే ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బీసీసీఐ కార్యదర్శి జై షా పావులు కదిపాడు.

ఐసీసీ ప్రకటించే ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ)లో ఐపీఎల్‌కు ప్రాధాన్యత పెరిగింది.ప్రతి సంవత్సరం, మార్చి చివరి వారం నుండి జూన్ మొదటి వారం వరకు ఐపీఎల్ కోసం ఎఫ్‌టీపీలో చోటు కేటాయించబడుతుంది.

తదుపరి ఎఫ్‌టీపీలో ఐపీఎల్ అధికారికంగా రెండున్నర నెలల కాలం కలిగి ఉంటుందని, తద్వారా అగ్రశ్రేణి అంతర్జాతీయ క్రికెటర్లందరూ పాల్గొనవచ్చని జై షా చెప్పారు.వివిధ బోర్డులతో పాటు ఐసిసితో చర్చించగా ఈ నిర్ణయం వెలువడిందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube