అదిరిపోయే స్టెప్పులతో దుమ్మురేపిన ఐఏఎస్ ఆఫీసర్.. వీడియో చూస్తే..!

ఈ రోజుల్లో ఐఏఎస్ ఆఫీసర్లు తమలోని కొత్త టాలెంట్స్‌ను బయట పెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.ఇటీవల లేడీ ఐఏఎస్ ఆఫీసర్ దివ్య ఎస్.

 Ias Officer With Crezee Steps , Dance , Ias Officer, Viral Latest, News Viral,-TeluguStop.com

అయ్యర్ స్టూడెంట్స్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే.దీంతో నెటిజన్లు అందరూ ఫిదా అయిపోయారు.

అయితే ఇప్పుడు మరో ఐఏఎస్ అధికారి సెగలు పుట్టించే స్టెప్పులతో దుమ్మురేపారు.ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్ లాగా ఉర్రూతలూగించే స్టెప్స్ వేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.ఈ వీడియో చూసి వావ్, కేక పుట్టించారు సార్ అని సైబర్ సిటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.ఇటీవల కర్ణాటకలోని ధార్వాడ్ సిటీలో ఓ ట్రెడిషనల్ ఈవెంట్ జరిగింది.ఈ కార్యక్రమంలో హుబ్బలీ ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఐఏఎస్ బీ.గోపాల్ కృష్ణ పాల్గొన్నారు.అనంతరం స్టేజ్ పైకి వచ్చిన అతను ఓ కన్నడ సాంగ్‌కు హుషారుగా డ్యాన్స్ చేయడం ప్రారంభించారు.ఇది చూసిన హెచ్‌డీఎంసీ ఉద్యోగులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఒక హీరోలా ఫుల్ ఎనర్జీతో గ్రేస్ ఫుల్ స్టెప్స్ వేస్తుంటే వారంతా ఫుల్ ఎంజాయ్ చేశారు.అంతేకాదు, చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తూ ఐఏఎస్ అధికారిలో మరింత జోష్ నింపారు.

ఈ డ్యాన్స్ చేసిన తర్వాత తనకు చిరు ప్రాయం నుంచే నుంచి డ్యాన్స్ చేయడమంటే మహా ఇష్టం అని గోపాల్ కృష్ణ తెలిపారు.స్కూల్ డేస్ నుంచి స్టేజెస్‌పై డ్యాన్స్ చేస్తున్నాం అని ఇప్పటికీ దీనిని కంటిన్యూ చేస్తున్నానని ఈ కర్ణాటక ఐఏఎస్ పేర్కొన్నారు.ఈ డ్యాన్స్ ఈ వీడియోని చూసి “సార్ రాక్స్.ఎవ్రీ వన్ షాక్స్” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.“వావ్, వాట్ ఏ ఎనర్జీ సార్, చించేసారు” అని ఇంకొక నెటిజన్ కామెంట్ చేశాడు.దీనిని మీరు కూడా చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube