మన దేశంలోని యువతలో ఎంతోమందిలో టాలెంట్ ఉంది.అయితే ఆ టాలెంట్ ను సద్వినియోగం చేసుకుని విజయాలను సొంతం చేసుకునే వారు మాత్రం తక్కువమంది ఉన్నారు.
ఐఏఎస్ ఆఫీసర్ షేక్ అన్సార్( IAS Shaikh Ansar ) సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది.మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ఆటో డ్రైవర్ కొడుకు( Auto Driver Son ) అయిన షేక్ అన్సార్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కృషి ఉంది.
సివిల్స్ టార్గెట్ గా పెట్టుకున్న షేక్ అన్సార్ ఎంతో కష్టపడి తన లక్ష్యాన్ని సాధించారు.
మహారాష్ట్ర రాష్ట్రంలోని( Maharashtra ) జాల్నా గ్రామానికి చెందిన అన్సార్ బాల్యం నుంచి ఎంతో శ్రద్ధగా చదివేవారు.
అన్సార్ తండ్రి షేక్ అహ్మద్( Shaikh Ahmed ) ఆటో డ్రైవర్ గా పని చేసేవారు.తండ్రి మద్యానికి బానిస కాగా అన్సార్ తండ్రి రెండో భార్య కొడుకు కావడం గమనార్హం.
ఎన్నో కష్టాల మధ్య పెరిగిన అన్సార్ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కష్టపడి చదవాలని అనుకున్నాడు.ఆర్థిక ఇబ్బందుల వల్ల అన్సార్ సోదరుడు అనీస్ చిన్న వయస్సులోనే చదువు మానేసి గ్యారేజీలో పనికి చేరారు.

అన్సార్ 12వ తరగతిలో 91 శాతం మార్కులు సాధించగా 73 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేశారు.సివిల్స్( Civils ) కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలో వరుసగా మూడేళ్ల పాటు రోజుకు 12 గంటలు చదివానని అన్సార్ చెప్పుకొచ్చారు.2015 యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో అన్సార్ మంచి ర్యాంక్ ను సాధించారు.21 సంవత్సరాల వయస్సులోనే ఐఏఎస్( IAS ) కావాలనే కలను అన్సార్ నెరవేర్చుకున్నారు.

కష్టాలు, సమస్యలను పట్టించుకోకుండా లక్ష్యం కోసం కష్టపడితే కెరీర్ పరంగా సక్సెస్ దక్కుతుందని అన్సార్ ప్రూవ్ చేశారు.హార్డ్ వర్క్, సరైన్ గైడెన్స్ ఉంటే యూపీఎస్సీ పరీక్షలో సక్సెస్ దక్కుతుందని ఆయన చెబుతున్నారు.మీకు మీరే పోటీ అని గుర్తుంచుకోవాలని అన్సార్ కామెంట్లు చేశారు.అన్సార్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







