తెలంగాణ ముఖమంత్రి కేసిఆర్( CM kcr )ఈసారి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.అయితే ఈసారి ఎన్నికల్లో కేసిఆర్ ను ఓడించేందుకు బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు పకడ్బందీగా ప్లాన్ చేసి అగ్రనేతలైన ఈటెల రాజేందర్ మరియు రేవంత్ రెడ్డి లను బరిలో దించాయి.
కేసిఆర్ కు పోటీగా గజ్వేల్ నుంచి బీజేపీ తరుపున ఈటెల పోటీలో ఉండగా కామారెడ్డి నుంచి కాంగ్రెస్ తరుపున రేవంత్ రెడ్డి సై అంటున్నారు.కాగా గజ్వేల్ లో కేసిఆర్ తో పోటీని ఈటెల ( Etela Rajender )సీరియస్ గా తీసుకుంటే.
రేవంత్ రెడ్డి మాత్రం కేసిఆర్ తో పోటీని లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కామారెడ్డిలో కాంగ్రెస్ బలం ఎక్కువగానే ఉంది.అయితే గతంలో కాంగ్రెస్ ( Congress )హవా కొనసాగినప్పటికి 2018 ఎన్నికల్లో మాత్రం బిఆర్‌ఎస్( BRS ) పై చేయి సాధించింది.కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పై బిఆర్‌ఎస్ నేత గంప గోవర్ధన్ రెడ్డి ఐదు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఈసారి బిఆర్‌ఎస్ తరుపున డైరెక్ట్ గా కేసిఆరే బరిలో ఉన్నారు.దాంతో కామారెడ్డిలో బిఆర్‌ఎస్ విజయం నల్లేరు మీద నడకలాగే మారే అవకాశం ఉంది.అందుకే కాంగ్రెస్ తరుపున షబ్బీర్ అలీ స్థానంలో రేవంత్ రెడ్డి ( Revanth Reddy )పోటీ చేయనున్నారు.అయితే కామారెడ్డిలో విజయం పై రేవంత్ రెడ్డికి కూడా నమ్మకం లేదని తెలిస్తోంది.
ఇక్కడ కేవలం కేసిఆర్ ( CM kcr )కు పోటీ కారణంగానే తాను పోటీ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ఇటీవల చెప్పడం కొత్త సందేహాలకు తావిస్తోంది.అంతే రేవంత్ రెడ్డి( Revanth Reddy ) నామమాత్రంగానే ఇక్కడ పోటీ చేస్తున్నారా అనే అనుమానాలు పోలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నాయి, గత ఎన్నికల్లో కోడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి అక్కడ కూడా ఓటమి చవి చూశారు.దాంతో ఈసారి ఎన్నికల్లో అక్కడ గెలుపు కోసం పూర్తి ఫోకస్ అంతా కోడంగల్ పైనే పెట్టారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో కేసిఆర్ పై పోటీ చేస్తూ గెలిస్తే సంచలనమే.
ఒడితే నామమాత్రమే అనే దొరణిలో రేవంత్ రెడ్డి ఉన్నారట.మరి కామారెడ్డిలో కేసిఆర్ కు రేవంత్ రెడ్డి ఎంతవరకు పోటీనిస్తారో చూడాలి.