యాదాద్రి జిల్లా:రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి.కాగా శనివారం ఉదయం మునుగోడు “నిన్ను క్షమించదు” అంటూ రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చౌటుప్పల్ ప్రధానకూడలిలో వాల్ పోస్టర్ వేశారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉన్న రోజే వాల్ పోస్టర్లు వెలవడం చర్చనీయాంశంగా మారింది.కొంత మంది ఆగంతకులు అల్లర్లు సృష్టించడానికే ఈ వాల్ పోస్టర్లు వేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే కరోనా బారిన పడిన రేవంత్ తన పాదయాత్రను రద్దు చేసుకోవడంతో కాంగ్రేస్ సీనియర్ నేత రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.







