బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి( BRS Former Minister Malla Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఐదేళ్లలో ఏమైనా జరగొచ్చని తెలిపారు.
తన అదృష్టం బాగుంటే మళ్లీ మంత్రి అయ్యే అవకాశం రావచ్చని మల్లారెడ్డి పేర్కొన్నారు.అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly Elections ) తాము ఓడిపోతామని కలలో కూడా అనుకోలేదని తెలిపారు.
ఆ షాక్ నుంచి తాము ఇంకా తేరుకోలేదని చెప్పారు.మల్కాజిగిరి ఎంపీగా తననే పోటీ చేయమన్నారని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే తన కుమారుడు భద్రారెడ్డికి టికెట్ అడుగుతున్నానని ఆయన వెల్లడించారు.