ప్రస్తుత సమాజంలో అధిక బరువు( Overweight ) తగ్గడానికి చాలామంది ప్రజలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.కొంతమంది ఎంతో కష్టపడి జిమ్ కు కూడా వెళ్లి కసరత్తులు చేస్తూ ఉన్నారు.
అధిక బరువు తగ్గాలంటే కష్టపడడం ఒక్కటే మార్గం కాదు.ఎంజాయ్ చేస్తూ కూడా బరువును తగ్గ వచ్చిన నిపుణులు చెబుతున్నారు.
ఏరోబిక్ వ్యాయామం( Aerobic Exercise )తో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.ఫ్యాటీ లివర్ సమస్య( Fatty Liver Problem ) ఉన్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఫ్యాటీ లివర్ అనేది చిన్న సమస్య కాదు.దీని వల్ల చాలా ప్రమాదం ఉంటుంది.
ఎలా అంటే ఇంటిని రోజు క్లీన్ చేస్తుంటే అంతంత మాత్రం శుభ్రంగా ఉంటుంది.అలాంటిది రోజు పది మంది తిరిగే ఇంటిని అసలు క్లీన్ చేయకుండా నెలల తరబడి అలాగే ఉంటే అది ఎంతో చెత్తగా మారిపోతుంది.
అలాగే మీ శరీరంలో లివర్ పని చేయకుండా ఉంటే లోపల అంతా చెత్త తయారవుతుంది.కాలేయం వాపు, కాలేయం దెబ్బతినడం లాంటి సమస్యలు వస్తాయి.కాలేయ పరిమాణాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఏరోబిక్ వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.ఫ్యాటీ లివర్ సమస్య ఉన్న వారు వారానికి 150 నిమిషాలు అంటే మొత్తం 2 1/2 గంటల పాటు వ్యాయామం చేస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఇలా చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ( Blood Circulation ) మెరుగుపడుతుంది.శరీర బలం పెరుగుతుంది.శరీరం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.ఈ డాన్స్ ద్వార సన్నబడితే ఫ్యాటిలివర్ సమస్య తగ్గిపోతుంది.
నడుము చుట్టూ కొవ్వు కూడా తగ్గిపోతుంది.ముఖ్యంగా చెప్పాలంటే మెరుగైన జీవక్రియ కూడా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.దీనితో పాటు జాగింగ్, జంపింగ్ జాక్స్ స్కిప్పింగ్ స్టైర్ ట్రైనింగ్, మెట్లు ఎక్కి దిగడం లాంటివి చేస్తూ ఉండాలి.ఇవన్నీ బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.ముఖ్యంగా ఆల్కహాల్, షుగర్, వేయించిన ఆహారం, పాస్తా, అధిక ఉప్పు గల ఆహారాలకు దూరంగా ఉండడం ఎంతో మంచిది.బీన్స్, చేపలు, ఓట్ మిల్, గింజలు,పొద్దుతిరుగుడు విత్తనాలు, వెల్లుల్లి వంటివి తీసుకుంటూ ఉండాలి.
ముఖ్యంగా చెప్పాలంటే ఫ్యాటీ లివర్ అనేది కాలయం వాపు కు దారి తీస్తుంది.మద్యపానానికి దూరంగా ఉండడం, క్రమం తప్పకుండా వ్యామోహం చేయడం లాంటివి చేయాలి.
లేదంటే ప్రాణానికి ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.