సౌత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.అనగనగా ఒక ధీరుడు సినిమా ద్వారా హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ ఆ తర్వాత ఓ మై ఫ్రెండ్, గబ్బర్ సింగ్ వడ్డీ ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.
ఇలా తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండే శృతిహాసన్.తాను ప్రేమించిన వ్యక్తి కోసం కొంతకాలం సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది.
ఈ క్రమంలో తన ప్రియుడితో కలిసి విదేశాలలో స్టేజ్ పెర్ఫార్మన్స్ లు చేస్తూ సందడి చేసింది.
ఇక శాంతనుతో శృతిహాసన్ గత కొంతకాలంగా రిలేషన్ లో లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
వీరి రిలేషన్ గురించి శృతి స్వయంగా ఓపెన్ అయ్యింది.ప్రస్తుతం వీరిద్దరూ ముంబైలో ఓకే ఇంట్లో కలిసి నివసిస్తున్నారు.
ప్రస్తుతం శృతిహాసన్ మల్లి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలలో నటిస్తూ చాలా బిజీ అయ్యింది.చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలతో కలిసి నటిస్తోంది.
సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండే శ్రుతి హసన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.ఈ క్రమంలో సినిమా విశేషాలతోపాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా తన ప్రియుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.

శాంతను, తాను మంచి స్నేహితులమని.ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉంటామని చెప్పుకొచ్చింది.అంతే కాకుండా వారిద్దరూ కలసి జీవిస్తున్నట్లు కూడా వెల్లడించింది.
అంతే కాకుండా వారిద్దరి గురించి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ కూడా కలిసి చదువుతూ ఎంజాయ్ చేస్తామని చెప్పుకొచ్చింది.ఇక తన ప్రియుడు శాంతను గురించి చెబుతూ.
అతను చాలా మంచి వ్యక్తి.తను చాలా ప్రశాంతంగా, దయాగుణం కలిగిన వ్యక్తి.
అతనితో కలిసి ఉండటం వల్ల శ్రుతి లో కూడా చాలా మార్పు వచ్చిందని వెల్లడించింది.ఇప్పుడు తాను చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు తెలిపింది.
శాంతనులో ఉండే దయాగుణం, ప్రశాంతత అంటే తనకి చాలా ఇష్టమని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.








