నేనెప్పుడూ అలా చేయలేదు : కాజల్ అగర్వాల్

తెలుగు చిత్ర పరిశ్రమలో కాజల్ అగర్వాల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

టాలీవుడ్కు పరిచయమై దశాబ్ద కాలం గడిచిపోతున్నప్పటికి కూడా స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటోంది.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకి హాజరైన కాజల్ అగర్వాల్ తన కెరియర్ పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.మీకు అడ్డంకిగా అనిపించిన బలహీనతలు ఏమైనా ఉన్నాయా వాటి వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డారా అని ప్రశ్నించగా.

నేను ఏ విషయాన్ని కూడా నా బలహీనత అనుకోను అంటూ తెలిపింది కాజల్ అగర్వాల్.సమస్యను చూసి పారిపోవడం భయపడం చేస్తే రోజురోజుకు అది బలహీనతగా మారుతుందని.

అందుకే ప్రతి సమస్యను సవాలుగా తీసుకుంటా అంటూ కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.తాను ఎప్పుడూ చాలెంజింగ్ పాత్రలు ఎంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను అని తెలిపింది ఈ అమ్మడు.

Advertisement

ఛాలెంజింగ్ పాత్రలు చేసినప్పుడే తనని తాను ప్రేక్షకుల ముందుకు కొత్తగా ఆవిష్కరించడానికి అవకాశం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది.ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని కానీ అవన్నీ తనకు తీపి జ్ఞాపకాలు అంటూ చిలిపి నవ్వు నవ్వేసింది.

కాగా ప్రస్తుతం కాజల్ ఆచార్య, భారతీయుడు 2 సినిమాల్లో నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు