Mahalakshmi: నా భర్త బరువుగా ఉండడం వల్ల ఆ టైంలో ఏడ్చేశా..మహాలక్ష్మి రవీందర్ కామెంట్స్ వైరల్..!!

మహాలక్ష్మి రవీందర్ (Mahalakshmi Ravinder) .ఈ జంట గురించి తెలియని సినీ ప్రేమికులు ఉండరు.

 I Cried At That Time Because My Husband Was Heavy Mahalakshmi Ravinder Comments-TeluguStop.com

వీళ్లు పెళ్లి చేసుకున్న సమయంలో వీరి గురించి ఎన్ని ట్రోల్స్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక సీరియల్ నటి అయిన మహాలక్ష్మి (Mahalakshmi) నిర్మాత రవీందర్ ని పెళ్లి చేసుకుంది.

అయితే మహాలక్ష్మికి ఇది రెండో పెళ్లి అయితే మహాలక్ష్మి రవీందర్ ని కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని, ఆయన ఆస్తిపాస్తులను చూసి పెళ్లి చేసుకుంది కానీ ఆయనను చూసి కాదు అంటూ ఇలా ఎన్నో ట్రోల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.దానికి ప్రధాన కారణం మహాలక్ష్మి చాలా అందంగా ఉంటే నిర్మాత రవీందర్ మాత్రం చాలా లావుగా ఉంటారు.

దాంతో వీరిద్దరి గురించి ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి.అయితే రీసెంట్ గా రవీందర్ (Ravinder) ఓ వ్యక్తిని మోసం చేసి డబ్బులు తీసుకొని జైలు పాలైన సంగతి మనకు తెలిసిందే.

ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మహాలక్ష్మి మాట్లాడుతూ.మా పెళ్లి సమయంలో ఎంతో మంది ట్రోల్స్ చేశారు.కానీ వాటన్నింటిని మేము పట్టించుకోలేదు.

Telugu Mahalakshmi, Ravinder, Serialactress, Trolls-Movie

అలాగే నా భర్త రవీందర్ అధిక బరువు( Over Weight ) ఉండడంవల్ల నేను కూడా ఆయన కోసం బరువు పెరుగుతున్నాను.ఇక రవీందర్ బరువు తగ్గాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా రియాక్ట్ అవ్వడం లేదు.అంతే కాదు ఆయన వల్ల నేను నా బరువుని పెంచుకోవలసి వస్తుంది.

ఎందుకంటే నేను నిద్రపోతున్న సమయంలో వచ్చి నన్ను లేపి మరీ అన్నం తినమని ఇబ్బంది పెడతారు.ఇక ఆ టైం లో నా నిద్ర డిస్టర్బ్ అవుతుంది.

Telugu Mahalakshmi, Ravinder, Serialactress, Trolls-Movie

అంతేకాదు తినడం మొదలు పెడితే నేను కూడా చాలానే తింటూ ఉంటా.అలా నా డైట్ కూడా మిస్ అయ్యాను.ఇక ఇలాగే తింటూ ఉంటే నేను కూడా ఏదో ఒక రోజు రవీందర్ లాగే లావుగా తయారవుతాను.అలాగే రవీందర్ కి తెల్ల వెంట్రుకలు కూడా వచ్చేస్తున్నాయి అంటూ ఆ ఇంటర్వ్యూలో మహాలక్ష్మి కాస్త బాధపడుతూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం మహాలక్ష్మి (Mahalakshmi) మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube