ఏపీ అధికార పార్టీ వైసీపీలో పరిణామాలు ఆందోళనకరంగా మారాయి.ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు సమయం ఉండగా.
ఆ పార్టీలోని నాయకులు ఒక్కొక్కరుగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతో పార్టీకి దూరమవుతున్నారు. ఇప్పటికే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి( Alla Ramakrishna Reddy ) పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఆయన రాజీనామాకు పూర్తి కారణాలు తెలియనప్పటికీ ఆళ్ల ను బుజ్జగించేందుకు వైసిపి కీలక నేతలంతా రంగంలోకి దిగారు.ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యవహారం అలా ఉండగానే.
మరో వైసీపీ ఎమ్మెల్యే పార్టీకి, పదవికి రాజీనామా చేశారంటూ మీడియా , సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది .దీంతో ఈ వ్యవహారంపై మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్( Vasantha Krishna Prasad ) ఈ వ్యవహారంపై స్పందించారు .పార్టీకి రాజీనామా చేశాను అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, తన రాజీనామా ప్రచారాన్ని ఖండిస్తున్నానని కృష్ణ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు .
ఎమ్మెల్యే పదవికి , వైసీపీకి రాజీనామా చేయాల్సిన అవసరం తనకు లేదు అని కృష్ణ ప్రసాద్ ( Vasantha Krishna Prasad )క్లారిటీ ఇచ్చారు .వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని, అటువంటప్పుడు తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుందని కృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు.ఇవన్నీ తమ రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న విష ప్రచారం అని , వీటిని ప్రజలు ఎవరూ నమ్మవద్దని కోరారు.
కావాలనే కొంతమంది పనుగట్టుకుని తాను రాజీనామా చేసినట్లుగా అసత్య ప్రచారం చేస్తున్నారని కృష్ణ ప్రసాద్ మండిపడ్డారు.
ఇప్పటికే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేయగా, గాజువాక వైసిపి నియోజకవర్గ ఇన్చార్జి దేవన్ రెడ్డి ( Devan Reddy (సైతం పార్టీకి రాజీనామా చేశారు.ఈ నేపథ్యంలో కృష్ణ ప్రసాద్ కూడా రాజీనామా చేసినట్లు వార్తలు రావడం కలకలం సృష్టించింది.