సినీ పరిశ్రమలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇక ఈమె వారసురాలిగా ఇండస్ట్రీలోకి జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చారు.ప్రస్తుతం ఈమె వరుస బాలీవుడ్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
అయితే తరచూ జాన్వీ కపూర్ గురించి పెద్ద ఎత్తునవార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.శ్రీదేవి వారసురాలిగా మాత్రమే తనకు అవకాశం వచ్చింది అంటూ భారీగా నేపోటిజంపై ఈమెను ట్రోల్ చేస్తూ ఉండేవారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె ఈ విషయంపై స్పందిస్తూ ఇండస్ట్రీలో తన గురించి చాలా మందికి ఓ దురభిప్రాయం ఉంది.వారసత్వంపై ఇండస్ట్రీలోకి వచ్చి.స్టార్ డమ పొందాలి అని అనుకోవడం లేదని.అయినా కానీ నేను గొప్ప నటిని కాకపోవచ్చు అలాగే గొప్ప అందగత్తెను కూడా కాకపోవచ్చు కానీ షూటింగ్ లొకేషన్లోకి వెళ్ళినప్పుడు తాను 100% కష్టపడి పని చేస్తానని తెలిపారు.
తాను కష్టపడి పనిచేసే తత్వమే తనని ఇండస్ట్రీలో నిలబెడుతుందని ఈమె తెలియజేశారు.
తనకు ఇండస్ట్రీలో స్టార్ కిడ్ అని అవకాశాలు రాలేదని, అవకాశాల కోసం ఎంతో కష్టపడ్డానని తెలిపారు.తాను లొకేషన్ లో ఎంతలా కష్టపడతాననే విషయాన్ని రక్తంలో రాసివ్వడానికి కూడా తాను వెనకాడనని,అందులో అనుమానం అవసరం లేదని అయితే చేసిన పనిని మరీ మరీ చేయాలంటే తనకు ఎంతో బోర్ అంటూ ఈ సందర్భంగా జాన్వీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.తాజాగా ఈమె నటించిన గుడ్ లక్ జెర్రీ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.