Deepti Sunaina Shanmukh ; నేనొక ఆట బొమ్మను.. దీప్తి సునైనా షాకింగ్ ఇన్స్టా స్టోరీ!

సోషల్ మీడియా స్టార్ దీప్తి సునైనా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.డబ్స్మాష్ వీడియోలతో సోషల్ మీడియా ప్రియులను పలకరించిన ఈ బ్యూటీ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది.

 I Am A Toy Deepti Sunaina Shocking Insta Story , Deepti Sunaina ,deepti Sunaina-TeluguStop.com

తన వీడియోలతో ఎంతోమంది సోషల్ మీడియా ప్రియులను అభిమానులుగా మార్చుకుంది.

పలు వెబ్ సిరీస్ లలో కూడా చేసి నటిగా కూడా మంచి మార్కులు సంపాదించుకుంది.

అలా ఆ హోదాతోనే రియాలిటీ షో బిగ్ బాస్ లో అడుగుపెట్టింది.దీంతో మరింత గుర్తింపు సంపాదించుకుంది దీప్తి సునైనా.అంతేకాకుండా హౌస్ లో ఉన్నంతకాలం బాగా అల్లర్లు చేస్తూ సందడి చేసింది.తోటి కంటెస్టెంట్లతో బాగా ఫ్రీగా మూవ్ అయ్యింది.

ఆ సమయంలో తన మాజీ బాయ్ ఫ్రెండ్ షణ్ముఖ్ గురించి బయటపెట్టి.ఆ షణ్ముఖ్ ఎవరా అన్నట్లు ప్రేక్షకులలో అనుమానాలు పెంచింది.ఆ తర్వాత తను హౌస్ నుండి బయటికి వచ్చాక షణ్ముఖ్ కూడా అందరికీ పరిచయమయ్యాడు.ఈయన కూడా సోషల్ మీడియా స్టార్.

పలు వెబ్ సిరీస్ లు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అంతేకాకుండా తన నటనతో సోషల్ మీడియా ప్రియులను అభిమానులుగా మార్చుకున్నాడు.

ఇక ఇతడు కూడా ఇదే హోదా తో బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి ఎంత రచ్చ చేశాడో చూసాం.ఇక ఈ షో లోనే దీప్తికు, తనకు మధ్య ప్రేమ ఉందని తెలిసింది.

కానీ అతడు హౌస్ నుండి బయటకు వచ్చాక దీప్తి బ్రేకప్ చెప్పేసింది.కారణం ఏంటో అందరికీ తెలిసిందే.

-Movie

దీంతో అప్పటినుంచి దీప్తి తనలోని ఎమోషనల్ కంట్రోల్ చేసుకొని బయటకు చాలా యాక్టివ్ గా కనిపించింది.సోషల్ మీడియాలో కూడా ఎప్పటిలాగే యాక్టివ్ గా ఉంది.తనకు సంబంధించిన ఫోటోలను, డాన్స్ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతుంది.ఇక తాజాగా మరోసారి తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.

వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.అయితే ఓ నెటిజన్ తనను.

ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు అక్క.అసలు మీ ఫేస్ లో టెన్షన్స్ కానీ.

స్ట్రెస్ ఫీల్ ఏం కనిపించదు.సూపర్ అక్క అంటూ కామెంట్ చేయగా వెంటనే దీప్తి దీనికి స్పందించింది.

-Movie

లైఫ్ లో.నేను ఏం చూస్తానో అదే మీరు చూస్తారు.నా లైఫ్ లో 24 గంటల్లో నేను ఎలా ఉంటానో.మీ లైఫ్ లో 24 గంటల్లో మీరు ఎలా ఉంటారో.ఆ దేవుడికి మాత్రమే తెలుసు.నువ్వు ఏం చేస్తావో నీకు కూడా తెలవదు.

దేవుడు ఆడించే ఆట బొమ్మలం రా మనము.అందులో నేను ఒక ఆట బొమ్మను అంటూ కామెంట్ చేసింది.

ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube