బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లుగా కొనసాగుతుండగా సుమ యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే కొన్ని దశాబ్దాల నుంచి ఈమె యాంకర్ గా ఎంతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.
ఇకపోతే తాజాగా క్యాష్ కార్యక్రమంలో భాగంగా శ్రీరామ్, భాను శ్రీ, జెమిని సురేష్, రాము, రామారావు వంటి తదితరులు హాజరైనట్టు తెలుస్తోంది.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అయింది.
ఇక ఈ కార్యక్రమంలో భాను శ్రీ పెద్ద ఎత్తున సందడి చేసినట్లు తెలుస్తోంది.
భాను శ్రీ యాంకర్ గా మాత్రమే కాకుండా బుల్లితెర నటి గా మంచి డాన్సర్ గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.
ఇక ఈమె ఈ కార్యక్రమంలో కి ఎంట్రీ ఇస్తూనే సుమ తన పై సెటైర్లు వేయడం మొదలు పెట్టింది.తన చేతికి పాలగ్లాసు ఇచ్చి పోడియం వద్దకు వెళ్ళమని తనపై సెటైర్లు వేశారు.
అదే విధంగా మరోసారి తనతో పాట పాటించడానికి ప్రయత్నం చేస్తూ తన గొంతు పై సుమ తనదైన శైలిలో కామెంట్లు చేశారు.మొత్తానికి సుమా ఈ కార్యక్రమంలో భాను శ్రీ ను ఓ రేంజ్ లో ఆడుకున్నారని చెప్పాలి.

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ లకు సుమ ఒక టాస్క్ ఇస్తూ.తన పిల్లాడు తప్పిపోయాడు మీరందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి తనే నీ కొడుకు అంటూ నటించాలని చెప్పారు.ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి యాక్టింగ్ చేయగా చివరికి భాను శ్రీ వచ్చి నేనే నీ కొడుకుని అంటూ చెబుతుంది.ఇలా తాను కొడుకు అంటూ భాను శ్రీ చెప్పడంతో సుమ మరోసారి తన పై పంచ్ వేసింది.
నాకు ముందే తెలుసు నువ్వు కొడుకువే అని ఎక్కడో డౌట్ వస్తుంది అంటూ సుమ పరోక్షంగా తను మగ పిల్లాడిలా వ్యవహరిస్తుంది అంటూ అందరి ముందు పరువు తీసింది.సుమ తనని అలా అనే సరికి ఒక్కసారిగా భానుశ్రీ షాక్ అవుతుంది.
మరి వీరందరితో కలిసి సుమ చేసిన హంగామా చూడాలంటే శనివారం వరకు వేచి చూడాలి.