సుధీర్ రష్మీ పెళ్లి తర్వాతే నా పెళ్లి... హైపర్ ఆది కామెంట్స్ వైరల్?

బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి హైపర్ ఆది( Hyper Aadi ) ప్రస్తుతం బుల్లితెరపై వెండితెరపై వరుస అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్నారు.

ఇకపోతే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హైపర్ ఆది తాజాగా తన పెళ్లి గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి.

సుధీర్(Sudheer ) ప్రదీప్ ( Pradeep ) వంటి వారి గురించి ఎప్పుడు ప్రస్తావన వస్తూనే ఉంటుంది.ఇలా వీరి పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి ఆ మాట దాటా వేస్తుంటారు.

అయితే తాజాగా యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఆదికి మరోసారి తన పెళ్లి గురించి ప్రశ్న ఎదురయింది.

సుధీర్ అయితే ఇటీవల కాలంలో తాను పెళ్లి చేసుకునే ఆలోచనలోనే లేనని పెళ్లి చేసుకోను అంటూ తెగేసి చెప్పేసారు.ఇక దేవుడు పెళ్లి వైపు దృష్టి మళ్లిస్తే చెప్పలేమని కూడా చెప్పేశారు .ఈ క్రమంలోనే ఆదిని మీ పెళ్లెప్పుడు అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ నాకన్నా పెద్ద వాళ్ళు ఇండస్ట్రీలో సుధీర్ రష్మీ ( Rashmi ) ప్రదీప్ వంటి వారంతా కూడా ఉన్నారు వీరందరూ పెళ్లి చేసుకున్న తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని ఆది తెలిపారు.

Advertisement

మరి ప్రేమ పెళ్లి చేసుకుంటారా పెద్దలకు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా అన్న ప్రశ్న కూడా ఈయనకు ఎదురు కావడంతో తాను పెద్దలు కుడుర్చిన పెళ్లికే ప్రియారిటి ఇస్తానని ఆది తెలిపారు.ఎందుకంటే పెద్దవారు మేము మా కొడుకుకి మంచి పిల్లను చూసి పెళ్లి చేసాము అని ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు.ఇలా పెద్దలు కుదుర్చిన పెళ్లి చేసుకోవడంలో వారికి చాలా ఆనందం ఉంటుందని అందుకే నేను ఎక్కువగా పెద్దలు కుదిర్చిన వివాహానికి ప్రాధాన్యత ఇస్తాను అంటూ ఈ సందర్భంగా హైపర్ ఆది చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు