జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుని ప్రస్తుతం బుల్లితెర టాప్ కమెడియన్లలో ఒకరిగా హైపర్ ఆది( Hyper aadi ) కెరీర్ ను కొనసాగిస్తున్నారు.ఒక్కో స్కిట్ కు హైపర్ ఆది ఏకంగా 4 లక్షల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు.
తాజాగా భోళా శంకర్ మూవీ ఈవెంట్ లో హైపర్ ఆది షాకింగ్ కామెంట్లు చేయగా హైపర్ ఆదిపై ట్రోల్స్ ఊహించని స్థాయిలో వస్తున్నాయి.</br.

యితే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అంగీకరిస్తే జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే కావాలని హైపర్ ఆది భావిస్తున్నారని తెలుస్తోంది.అయితే పవన్ కళ్యాణ్ నిజంగానే హైపర్ ఆదికి టికెట్ ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది.ఏపీలో జనసేన ( Janasena party )సొంతంగా లేదా మరో పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వస్తే మాత్రం హైపర్ ఆదికి మంత్రి పదవి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే పవన్ నుంచి అనుకూలంగా ఉంటే మాత్రమే హైపర్ ఆది రాబోయే రోజుల్లో ఈ విషయాలను వెల్లడించనున్నారు.కామెడీ షోల ద్వారా హైపర్ ఆది కళ్లు చెదిరే స్థాయిలో సంపాదించిన సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చినా వేర్వేరు కారణాల వల్ల హైపర్ ఆది ఆ ఆఫర్ కు అంగీకరించలేదు.
హైపర్ ఆది కామెడీకి గతంలో వచ్చిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.హైపర్ ఆదికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.హైపర్ ఆది కొన్ని సినిమాలకు రైటర్ గా వ్యవహరిస్తుండగా మరికొన్ని సినిమాలలో నటిస్తున్నారు.భోళా శంకర్ సినిమాలో కూడా ఆది నటించారని తెలుస్తోంది.
భోళా శంకర్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.ఈ నెల 11వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే.







