బుల్లితెర కమెడియన్ గా ఎన్నో అద్భుతమైన కామెడీ షో లలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి వారిలో హైపర్ ఆది ( Hyper Aadi ) ఒకరు ఈయన మొదట్లో జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమంలో కమెడియన్ గా పనిచేసే అనంతరం అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమంతో పాటు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో కూడా హైపర్ ఆది సందడి చేస్తున్నారు.
ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనటువంటి ఈయన ఇతర బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ మరోవైపు సినిమా అవకాశాలు అందుకుని వెండి తెరపై కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హైపర్ ఆదికి తన ఫ్యామిలీ ( Family ) గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ మేము మా నాన్నకు ముగ్గురు అన్నదమ్ములం మమ్మల్ని చదివించడం కోసం నాన్న అప్పు చేశారు.అయితే నేను జాబ్ చేసే సమయంలో వచ్చే జీతం మొత్తం వడ్డీ కట్టేకేసరిపోయేవి.
ఇలా వచ్చిన జీతం మొత్తం వడ్డీలకే సరిపోవడంతో చేసేదేమీ లేక మాకు ఉన్న మూడు ఎకరాల పొలం కూడా అమ్ముకున్నామని హైపర్ ఆది తెలియజేశారు.ఇక నాకు నటన మా నాన్న నుంచి వారసత్వంగా వచ్చిందేమోనని హైపర్ ఆది తెలిపారు.
మా నాన్న కూడా అప్పుడు నాటకాలు వేసేవారు.ఆయన చూసి నాకు కూడా నటన వచ్చిందని ఈయన తెలిపారు.ప్రస్తుతం ఆది స్క్రిప్ట్ రైటర్ గా పని చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే పూర్తిస్థాయి స్క్రిప్ట్ రెడీ చేసి హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే ప్రశ్న కూడా హైపర్ ఆదికి ఎదురయింది.
ఈ ప్రశ్నకు హైపర్ ఆది సమాధానం చెబుతూ పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ రెడీ చేయడం అంటే మామూలు విషయం కాదు.నాకు ఉన్నటువంటి కమిట్మెంట్స్ అన్ని పక్కన పెడితేనే అది సాధ్యమవుతుంది.
ప్రస్తుతం నేను ఆ పనులను మానుకోలేను, అంతేకాకుండా నేను హీరోగా రావాలి అన్న ఆలోచన నాకు అసలు ఏ మాత్రం లేదని, ప్రస్తుతం నేను నా కెరియర్ పరంగా హ్యాపీగా ఉన్నానని హైపర్ ఆది తెలిపారు.