హైడ్రా ' నెక్స్ట్ టార్గెట్ మల్లారెడ్డి ? 

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా ( హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ )  పైనే చర్చ జరుగుతోంది .

ముఖ్యంగా చెరువులు నాలాలు ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతూ వాటిని కూల్చి వేస్తున్న తీరు ఆక్రమణదారుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి.

ఇప్పటికే ఎంతోమంది ప్రముఖుల కు సంబంధించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు .ఇందులో ప్రముఖ సినీ హీరో నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ కూడా ఉంది.ఆక్రమణదారులు ఎంతటి పెద్దవారైనా వదిలిపెట్టేది లేదు అన్నట్లుగా హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుండడంతో ఇప్పటికే చెరువులు,  నాలాలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలు కూల్చ వేతకు గురయ్యాయి.

ఇదిలా ఉంటే ఈ కూల్చివేతల పర్వంలో మాజీ మంత్రి,  బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి( Malla Reddy ) లో భయాందోళనలు కలిగిస్తున్నాయి.

 హైడ్రా( hydra ) కూల్చివేతలతో మల్లారెడ్డి తనను లక్ష్యంగా చేసుకుని బుల్డోజర్లు వస్తాయని ముందుగానే అంచనాకు వచ్చారట దీంతో న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తూ హైడ్రా తమకు చెందిన నిర్మాణాల జోలికి రాకుండా ముందస్తుగా ఏ చర్యలు తీసుకోవాలనే దానిపైన ప్రధానంగా చర్చిస్తున్నారట.అన్ని కుదిరితే ఈరోజు న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనతో ఉన్నారట.గతంలో మల్లారెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ తో పాటు రేవంత్ రెడ్డి( Revanth Reddy)ని టార్గెట్ చేసుకుని అనేక విమర్శలు చేశారు.

Advertisement

  రేవంత్ రెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేశారు ఇప్పుడు మల్లారెడ్డి మాజీ అయ్యారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో పూర్తిగా తనపై ఫోకస్ చేస్తారని హైడ్రాను అడ్డం పెట్టుకుని తనకు చెందిన ఆస్తుల ను ధ్వంసం చేస్తారని మల్లారెడ్డి టెన్షన్ పడుతున్నారు.అయితే మల్లారెడ్డి ఆరోపణలు ఇప్పటివి కాదు.ఎప్పటి నుంచో ఆయన పై అనేక ఆరోపణలు ఫిర్యాదులు ఉన్నాయి.

  ఎంతోమంది భూములను ఆక్రమించుకున్నారని,  తక్కువ ధరకు భూములను కొనుగోలు చేసి తమను మోసం చేశారని అనేకమంది ఆయనపై చేసిన ఫిర్యాదులు ఇంకా పోలీస్ స్టేషన్ లో పెండింగ్ లోనే ఉన్నాయి .ప్రధానంగా మల్లారెడ్డి చెరువులు నాళాలను ఆక్రమించి ఆసుపత్రులతో పాటు  కళాశాలలు,  యూనివర్సిటీలను నిర్మించారne ఫిర్యాదు కూడా తాజాగా  అందిందట. మల్లారెడ్డి కళాశాలలను నిర్మించిన స్థలాల పైన ఎన్నో రకాల వివాదాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే హైడ్రా పేరుతో వాటన్నిటిపై ఫోకస్ చేస్తే భారీగా నష్టపోవాల్సి వస్తుందనే టెన్షన్ మల్లారెడ్డి లో స్పష్టంగా కనిపిస్తోంది.

బీఆర్ఎస్ లో ఈ మార్పులు... ఇక తీరుగులేదా ? 
Advertisement

తాజా వార్తలు