బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) నటించిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”జవాన్”.ఈ సినిమా కోసం అటు బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో అంతటా క్రేజ్ పెరిగింది.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఈ వీకెండ్ లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ( Director Atlee ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ”జవాన్”( Jawan ).‘పఠాన్’ సినిమా హిట్ తో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చిన షారుఖ్ ఖాన్ ఫుల్ జోష్ తో జవాన్ సినిమాను పూర్తి చేసి రిలీజ్ కు సిద్ధంగా ఉంచాడు.ఇక ఈ సినిమాతో షారుఖ్ రికార్డులను నెలకొల్పేలానే ఉన్నాడు.తెలుగులో కూడా ఎప్పుడు లేని విధంగా జవాన్ మానియా కనిపిస్తుంది.
తాజాగా ఈ సినిమాకు హైదరాబాద్( Hyderabad ) లో ఎంత క్రేజ్ ఉందో తెలిసేలా ఐకానిక్ ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో జవాన్ కటౌట్ ను పెట్టారు.షారుఖ్ ఖాన్ కు హైదరాబాద్ లో భారీ ఫాలోయింగ్ ఉంది.
ఈ క్రేజ్ ఇప్పుడు జవాన్ విషయంలో బాగా బయట పడింది.ఇప్పటికే ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి.
మరి ఈ సినిమా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.
ఈ సినిమాలో దీపికా పదుకొనె( Deepika Padukone ) అతిథి పాత్రలో నటించగా.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.విజయ్ సేతుపతి, ప్రియమణి, సునీల్ గ్రోవర్, సన్యా మల్హోత్రా వంటి వారు కీ రోల్స్ పోషిస్తున్నారు.
ఇక ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటెర్టైనమెంట్స్ పతాకంపై గౌరీ ఖాన్ నిర్మిస్తుండగా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కానుంది.మరి సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా షారుఖ్ కు ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాలి.