మాస్క్‌ లేకుంటే జేబుకు చిల్లు, దేశంలోనే ఫస్ట్‌ టైం హైదరాబాద్‌లో వినూత్న ప్రయోగం

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చిన విషయం తెల్సిందే.పలు ప్రాంతాల్లో రద్దీగా జనాలు తిరుగుతూనే ఉన్నారు.

అయితే కొందరు మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న నేపథ్యంలో వారికి చెక్‌ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ నిర్ణయాన్ని తీసుకుంది.మాస్క్‌ లేకుండా బయట కనిపిస్తే వెయ్యి రూపాయల ఫైన్‌ విధించనున్నారు.

మాస్క్‌ లేకుండా బయటకు వచ్చేందుకు జనాలు భయపడేలా ఫైన్‌ వసూళ్లు చేయాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది.ఇదే సమయంలో సీసీ కెమెరాల ద్వారా మాస్క్‌ లేని వారిని గుర్తించే టెక్నాలజీని ఇండియాలోనే మొదటి సారి హైదరాబాద్‌లో వాడుతున్నట్లుగా హైదరాబాద్‌ పోలీసులు తెలియజేశారు.

మాస్క్‌ లేని వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వారికి కూడా ఫైన్‌ను విధించబోతున్నట్లుగా పేర్కొన్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి అశ్రద్ద మంచిది కాదని, ఎట్టి పరిస్థితుల్లో కూడా జాగ్రత్తలు పాటిస్తూ రోజు వారి కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ వర్గాల వారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు