హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ బీజేపీపై విమర్శలు గుప్పించారు.జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ సభ్యుల తీరు బాధ కలిగించిందన్నారు.
కావాలనే బీజేపీ కార్పొరేటర్లు సభలో గందరగోళం సృష్టించారన్నారు.అన్ని అంశాలపై మాట్లాడదామన్న వినలేదని చెప్పారు.
అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కిషన్ రెడ్డి హైదరాబాద్ కు ఎన్ని నిధులు తీసుకువచ్చారని ప్రశ్నించారు.
కేంద్రం నుంచి నిధులు తేవడంతో కిషన్ రెడ్డి విఫలమైయ్యారని ఆరోపించారు.అభివృద్ధి కోసం కోట్లు ఖర్చు చేస్తున్నా బీజేపీ విమర్శిస్తోందని తెలిపారు.
ఎస్ఎన్డీపీ ద్వారా చాలా అభివృద్ధి పనులు చేపట్టామని మేయర్ స్పష్టం చేశారు.