Mujtaba Aziz Mohammed : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హైదరాబాదీ రికార్డ్...ముచ్చటగా

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ పట్టు సాధించింది.ఆ పార్టీ అభ్యర్ధులు ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ కి చెందిన కీలక స్థానాలలో సైతం విజయకేతనం ఎగురవేశారు.

 Hyderabad Man Mujtaba Aziz Mohammed Record In Us Mid-term Elections , Mujta-TeluguStop.com

ఏకంగా ట్రంప్ ప్రతిపాదించిన వ్యక్తులు సైతం ఓడిపోవడం ఆ పార్టీకి తీవ్ర నష్టం తెచ్చిపెట్టింది.ఈ క్రమంలో అత్యంత కీలకమైన 100 సభ్యులతో కూడిన సెనేట్ లో డెమోక్రటిక్ పార్టీకి మెజారిటీ ఓట్లు కైవసం చేసుకుంది.

ఇదిలాఉంటే ఈ ఎన్నికల్లో భారతీయుల హవా ఎప్పటిలానే కొనసాగింది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణా లోని హైదరాబాద్ మూలాలున్న వ్యక్తీ రికార్డ్ సృష్టించారు.

హైదరాబాద్ మూలాలు కలిగిన ఇండో అమెరికన్ అజీజ్ మహ్మద్ తాజాగా జరిగిన ఈ మధ్యంతర ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు.నార్త్ కరోలినా సెనేట్ తరుపున ఈ ఎన్నికల్లో నిలబడిన మహ్మద్ రికార్డ్ స్థాయిలో విజయం సాదించారు.

కాగా ఈ స్థానం నుంచీ మహ్మద్ ఎన్నికవ్వడం ఇది ముచ్చటగా మూడో సారి కావడం గమనార్హం.సహజంగా ఎన్నికల్లో ఒకసారి గెలవడమే కత్తిమీద సాములా ఉంటుంది అలాంటిది వరుసగా మూడో సారి విజయం సాధించడం సామాన్యమైన విషయం కాదు.

Telugu Democratic, Hyderabad, Indian American, Mujtabaaziz, Carolina, Toledo, Mi

మేక్లేన్బర్గ్ కౌంటీ 38 వ డిస్ట్రిక్ట్ నుంచీ డెమోక్రటిక్ పార్టీ తరుపున బరిలోకి దిగిన మహ్మద్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిని చిత్తుగా ఓడించడంతో ప్రస్తుతం మహ్మద్ పేరు మారుమోగుతోంది.ఇదిలాఉంటే మహ్మద్ తల్లి తండ్రులు హైదరాబాద్ నుంచీ 1980 ల్లోనే అమెరికాకు వలసలు వెళ్ళారు.1985 లో జన్మించిన మహ్మద్ నార్త్ కరోలినా లోనే డిగ్రీ పూర్తి చేసారు.చదువుకుంటున్న సమయంలోనే సేవా కార్యక్రమాలు చేపట్టిన మహ్మద్ రాజకీయంపై ఆకర్షితులై అనుకోని విధంగా ఎన్నికల్లో నిలబడ్డారు.

కాగా మొట్ట మొదటిసారిగా మహ్మద్ 1997 లో హైదరాబాద్ సందర్శించారు.మహ్మద్ తాత హైదరాబాద్ లోని పోలీస్ కమీషనర్ కార్యాలయంలో పనిచేసేవారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube