ఒక వెరైటీ సౌండ్‌తో సీసాలో నుంచి నురగలు కక్కుతూ బయటకు తన్నుకొచ్చే సోడా అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది.ఇప్పటికీ ఎండాకాలం వస్తే చాలు మామూలు సోడా, నిమ్మకాయ సోడా తాగంది చాలామంది ఉండలేరు.
అంతగా ఈ సోడా ప్రజలకు ఫేవరెట్ అయిపోయింది.అయితే లక్డికాపూల్ మెయిన్ రోడ్డులో 80 ఏళ్ల నాటి చిన్న దుకాణంలో అమ్మే మసాలా సోడాలకు మరింత ప్రత్యేకత ఉంది.
ఈ దుకాణానికి నేమ్ బోర్డ్ కూడా ఉండదు.
కానీ ఈ షాప్ కోసం వెతుక్కుంటూ నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు.కొందరేమో ఈ షాపును ‘ఐస్‌క్రీమ్ సోడా షాప్’గా పిలుస్తుంటే మరికొందరేమో ‘చిచా కూల్డ్‌రింక్స్’గా పిలుస్తుంటారు.1943లో ఈ దుకాణాన్ని ఓపెన్ చేయగా నిజాంల నుంచి ఆ కాలంలోని ప్రముఖ నటులు, క్రికెటర్లు, రాజకీయ నాయకుల వరకు అందరూ సోడా తాగడానికి ఈ షాపు వద్దకే వచ్చేవారట.

80 ఏళ్లు గడుస్తున్నా ఈ షాపు యజమాని అదే టెస్ట్ తో మసాలా సోడాలను తయారు చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు.అతనికి బాగా వయసు అయిపోయింది కాబట్టి ఇప్పుడు తన కొడుకు మహమ్మద్ ఒవైస్, అల్లుడు అబ్దుల్ హకీమ్ జావేద్ సహాయంతో దుకాణాన్ని నడుపుతున్నాడు.ఈ రోజుల్లో ఏ చిన్న షాప్ లో చూసిన ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది.అందులోనే కూల్డ్‌రింక్స్ ఉంచుతుంటారు కానీ చిచా కూల్డ్‌రింక్స్ ఇప్పటికీ ఐస్‌తో నిండిన పెట్టెలోనే ఉంచుతారు.

అలాగే వీరు తమ సోడాలలో మసాలా కలిపేసి రుచికరమైన డ్రింక్ ఆఫర్ చేస్తారు.1980లో మొదటిసారిగా ప్రత్యేకమైన మసాలాను సోడాతో కలపడం అతను ప్రారంభించారు.ఈ టెస్ట్ అప్పటి ప్రజలకు బాగా నచ్చడంతో ఈ సోడాలు బాగా అమ్ముడయ్యాయి.ఆ రుచి ఇప్పటికి ప్రజలను ఈ షాప్ కి తరలి వచ్చేలా చేస్తోంది.
ఈ షాపు వారు ఫ్రూట్ కోలా, నిమ్మకాయ, జీరా, అల్లం వంటి ఐదు రుచుల సోడాలను విక్రయిస్తారు.వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది ఐస్ క్రీమ్ రుచి.







